Samantha: బేబీ బంప్‌తో సమంత వర్కౌట్స్.. ఫిట్‌ నెస్‌ విషయంలో నో కాంప్రమైజ్‌

Updated on: Jul 05, 2026 | 4:31 PM

సమంత తన బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిట్‌నెస్‌పై తనకున్న కట్టుబాటును మరోసారి చాటిన ఆమె పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మాతృత్వ దశను ఆస్వాదిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సమంత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో సామ్ యాక్టింగ్, యాక్షన్ సీన్లలో.. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ప్రశంసలు కురిపించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సామ్ తన పర్సనల్ లైఫ్ లో మధురమైన దశను ఆస్వాదిస్తోంది. త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుడడంతో అమితానందంగా ఉంటోంది. ప్రస్తుతం కొన్ని రోజులు మెటర్నటీ లీవ్స్ తీసుకుని సినిమాలకు దూరంగా ఉండేందుకు డిసైడ్ అయిన సామ్‌… ఇటీవలే బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడేమో తన బేబీ బంప్ తో ఏకంగా వర్కౌట్స్ చేస్తున్న ఫోటోస్ పంచుకుని నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. ఫిట్నెస్ విషయంలో సమంత ఎంత జాగ్రత్తగా, శ్రద్దగా ఉంటారో చెప్పక్కర్లేదు. మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమయంలోనూ హెవీ వర్కవుట్స్ షేర్ చేసింది. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా సరే.. వర్కవుట్స్ మాత్రం వదలట్లేదు సమంత. ప్రత్యేక టైనర్‌ను ఫిక్స్ చేసుకుని మరీ… జిమ్లో వర్కవుట్స్ చేస్తూ కనిపిస్తోంది సామ్. తాజాగా జూన్ నలెకు సంబంధించిన తన జ్ఞాపకాల ఫోటో డంప్ ఇన్ స్టాలో షేర్ చేసింది సమంత. అందులో తను వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సైతం పంచుకుంది. అందులో అప్పర్ బాడీకి సంబంధించిన వర్కవుట్స్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామ్ ఫ్యాన్స్‌ను అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వీట్‌ షాపులో కరకరలాడే మిక్చర్‌ తింటున్నారా.. జాగ్రత్త!

Follow Us