Samantha: సమంతకు అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీలోనే
టైగర్‌కు టైమొచ్చింది.. ఇంక నన్నెవ్వరూ ఆపలేరు అంటూ లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా..? సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఈ డైలాగే గుర్తుకొస్తుందిప్పుడు. ఉన్నట్లుండి ఆ బ్యూటీస్ అంతా తెగ ట్రెండ్ అయిపోతున్నారు. అలాగని వాళ్లేం సినిమాలు చేయట్లేదిప్పుడు. మరి ఈ సడన్ ట్రెండింగ్‌కు రీజన్ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు సమంత.
టైగర్‌కు టైమొచ్చింది.. ఇంక నన్నెవ్వరూ ఆపలేరు అంటూ లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా..? సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఈ డైలాగే గుర్తుకొస్తుందిప్పుడు. ఉన్నట్లుండి ఆ బ్యూటీస్ అంతా తెగ ట్రెండ్ అయిపోతున్నారు. అలాగని వాళ్లేం సినిమాలు చేయట్లేదిప్పుడు. మరి ఈ సడన్ ట్రెండింగ్‌కు రీజన్ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు సమంత. తాజాగా మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తున్నారీమే. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో PM మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ రిసెప్షన్‌కు సమంతకు ప్రత్యేక ఆహ్వానం లభించడమే ఈ ట్రెండింగ్‌కు కారణం. సమంతకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో ఆమె అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఇక కృతిశెట్టి సైతం చాలా రోజుల తర్వాత ట్రెండింగ్‌లోకి వచ్చారు. దీనికి కారణం వా వాతియార్ సినిమా. పొంగల్‌కు వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది.. తాజాగా ఇందులోని రొమాంటిక్ సాంగ్ ఒకటి వచ్చింది.. అందులోని కృతి గ్లామరే ఈమెను ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. వా వాతియార్‌పై భారీ ఆశలు పెట్టుకున్న కృతి శెట్టికి ఇది పెద్ద షాకే ఇచ్చింది. స్యామ్, కృతితో పాటు సోషల్ మీడియాను ఊపేస్తున్న మరో బ్యూటీ మృణాళ్ ఠాకూర్. నిజానికి ఇప్పుడు కాదు.. గత కొన్ని రోజులుగా మృణాళ్ పేరు మార్మోగిపోతుంది.. దానికి కారణం ఓ అగ్ర హీరోతో ఆమె పెళ్ళి అనే వార్తలు రావడం.. మరోటి పెద్దిలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే ప్రచారం జరగడం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ సైతం తెగ ట్రెండ్ అయిపోతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మోస్ట్ సెలెబ్రేటెడ్ సాంగ్ వామ్మో వాయ్యో వీడియోను విడుదల చేసారు మేకర్స్. ఇందులో ఈ బ్యూటీస్ గ్లామర్ షో ఇద్దర్నీ అలా వైరల్ అయ్యేలా చేస్తుంది. దిశా పటానీ సైతం ఓ రోమియో పాటతో ట్విటర్‌ను షేక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
