Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

Updated on: Feb 25, 2026 | 5:59 PM

సాయి పల్లవి బాలీవుడ్, సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అమీర్ తనయుడు జునైద్‌తో ఏక్ దిన్, ప్రతిష్టాత్మక రామాయణతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం సౌత్ ప్రాజెక్టులపై దృష్టి సారించి ధనుష్‌తో ఒక సినిమాకు, మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన రొమాంటిక్ డ్రామాకు, ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజెంట్ నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సౌత్‌లోనూ ఆసక్తికరమైన మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమీర్ తనయుడు జునైద్ ఖాన్‌కు జోడీగా నటించిన ఏక్ దిన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కొంతకాలం సౌత్ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు నార్త్ షూటింగ్స్ చివరి దశకు చేరుకోవడంతో, తిరిగి సౌత్ చిత్రాలపై దృష్టి సారించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

Loading...
Unable to load recommendations.
Follow Us