అనిరుధ్‌కు ఆయనతోనే అసలు పోటీనా..?

Updated on: Jul 04, 2026 | 10:20 AM

దక్షిణాదిలో తిరుగులేని సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ రవిచందర్‌కు ఇప్పుడు కొత్త పోటీ ఎదురవుతోంది. యువ సంగీత సంచలనం సాయి అభ్యెంకర్ ప్రైవేట్ వీడియోలు, స్టార్ హీరోల చిత్రాలతో దూసుకువస్తున్నారు. అనిరుధ్ తరహాలోనే మ్యాజిక్ చేస్తున్న సాయి అభ్యెంకర్ రాక అనిరుధ్ స్థానానికి డేంజర్ సిగ్నల్ అవుతుందన్న చర్చ జరుగుతోంది.

దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో అనిరుధ్ రవిచందర్‌కు తిరుగులేదని, అసలు పోటీనే లేదని అందరూ భావిస్తున్నారు. ఆయన పేరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆ పాట హిట్‌ అనే భావన బలంగా ఉంది. అనిరుధ్ అన్ అఫీషియల్ నెంబర్ వన్ చైర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు సవాల్ విసురుతూ ఒక యువకుడు దూసుకొస్తున్నాడు. సాయి అభ్యెంకర్ పేరు అనిరుధ్ రవిచందర్‌తో సమానంగా మారుమోగుతోంది.సాయి అభ్యెంకర్ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలతో బాగా ట్రెండ్ అవుతున్నారు. తాజాగా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే, సూర్య-జ్ఞానవేల్ సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడు. ఈ మధ్యే కరుప్పు, డ్యూడ్ వంటి పాటలతో ఆయన రేంజ్ బాగా పెరిగింది. ఒకవైపు స్టార్ హీరోల ప్రాజెక్టులతో, మరోవైపు తన మార్క్ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలతో సాయి అభ్యెంకర్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం అనిరుధ్ ఎలాగైతే తన మ్యూజిక్‌తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడో, ఇప్పుడు సాయి అభ్యెంకర్ కూడా అదే మ్యాజిక్ చేస్తున్నారు. వరుస ఆఫర్‌లతో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఇదే జోరు గనుక కొనసాగితే, అనిరుధ్ రవిచందర్ స్థానానికి సాయి అభ్యెంకర్ కచ్చితంగా డేంజర్ సిగ్నల్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వీడియోల కోసం :

అంచనాలు పెంచేస్తున్న సెకండాఫ్ మూవీస్‌.. ఫస్టాఫ్‌ గాయాలను మరిపిస్తుందా..?

ఆలియా సినిమాపై ప్రభాస్‌ ట్వీట్‌.. ఆన్‌లైన్‌లో నయా డిస్కషన్‌

జస్ట్ 80 డేస్‌… క్రేజీ న్యూస్‌ రివీల్ చేసిన జక్కన్న

టాక్సిక్ టీజర్‌… మరింత బోల్డ్‌గా లేడీస్‌ గ్యాంగ్‌

నిరాశపరిచిన ఫస్టాఫ్‌… సెకండాఫ్ సంగతేంటి?

Follow Us