తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!

Updated on: Feb 28, 2026 | 8:15 PM

మీనా, వినీత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్' ఫిబ్రవరి 27న జియో హాట్‌స్టార్‌లో విడుదలయ్యింది. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. 17 ఏళ్ల రోస్లిన్ పీడకలలు, గ్రీన్ ఐడ్ స్ట్రేంజర్ కథాంశంగా, మల్టీలాంగ్వేజెస్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సిరీస్‌ రోస్లిన్. సుమేష్ నందకుమార్ దర్శకుడు. ‘దృశ్యం’ మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దీనికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్యలో రోస్లిన్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27న జియో హాట్ స్టార్‌ లో స్ట్రీమి అవుతోంది. తెలుగు తమిళ్.. మలయాళం, కన్నడ భాషల్లోనే కాదు.. మరాఠీ, బెంగాళీ భాషల్లో కూడా ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులో ఉంది. రోస్లిన్ అనే 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమెకు పదే పదే ఒకే రకమైన పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఆకుపచ్చ కళ్లు ఉన్న ఒక అపరిచితుడు ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి భయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు మీనా, వినీత్ అది కేవలం భ్రమ అని కొట్టిపారేస్తారు. అయితే, ఆ కలల్లో చూసిన వ్యక్తే ఒకరోజు వారి ఇంటికి అతిథిగా రావడం కథలో అసలైన మలుపు. అయితే నేరుగా రోస్లిన్ ఇంటికి వచ్చిన ఆ అపరిచితుడి అసలు ఉద్దేశం ఏమిటి? రోస్లిన్ తన భ్రమల నుంచి బయటపడి ఆ నిజాన్ని ఎలా నిరూపించింది అనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రిమైనింగ్ స్టోరీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు

Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే

బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు

టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి

Follow Us