Renu Desai: బద్రి సినిమా ముచ్చట్లు చెప్పిన రేణు దేశాయ్

Edited By:

Updated on: Apr 19, 2026 | 1:02 PM

రేణు దేశాయ్ తన 'బద్రి', 'జానీ' చిత్రాల జ్ఞాపకాలను పంచుకున్నారు. 'బద్రి'కి తన దుస్తులు తనే డిజైన్ చేసుకున్నానని, 'జానీ'కి ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉండి, చివరి నిమిషంలో హీరోయిన్‌గా మారానని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డాక్టర్ కావాలన్న ఆమె కల, దర్శకత్వ ప్రయాణం, రైతులపై సినిమా తీయాలన్న ఆలోచన వంటి భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించారు.

ఎక్కడ ఎవరు మాట్లాడినా, ఎవరు సందడి చేసినా… తమ అభిమాన హీరో ఆ టాపిక్‌లో ఉంటే ఇన్‌స్టంట్‌గా సెలబ్రేట్‌ చేసేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్. అలాంటిది బద్రి అండ్‌ జానీ సినిమాల ప్రస్తావన వస్తే సైలెంట్‌గా ఉంటారా చెప్పండి? బద్రి సినిమాలో నా కాస్ట్యూమ్స్ నేనే డిజైన్‌ చేసుకుంటానని డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌కి కండిషన్‌ పెట్టారట రేణు దేశాయ్‌. ఆయన ఓకే చెప్పడంతో వెంటనే యాక్సెప్ట్ చేశానని తొలినాళ్లని గుర్తుచేసుకున్నారు రేణు దేశాయ్‌? జానీ సినిమాకు తాను ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు రేణు. ఎవరూ సెట్‌ కాకపోవడంతో ఆఖరి నిమిషంలో తాను హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్టు చెప్పారు. జానీ సినిమా తర్వాత రీసెంట్‌గా టైగర్‌ నాగేశ్వరరావులో నటించారు రేణు. డాక్టర్‌ కావాలన్నది తన డ్రీమ్‌ అని, అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ఆమె చెప్పారు. ఆ మధ్య ఇష్క్ వాలా లవ్‌ మూవీని డైరక్ట్ చేసిన రేణు, త్వరలోనే రైతుల జీవితాల మీద మూవీ చేయనున్నారట. మరోవైపు యాక్టింగ్‌ కూడా కంటిన్యూ చేస్తున్నారు. రేణు ఫ్యూచర్‌ ప్రాజెక్టులకు బెస్ట్ విషెస్‌ చెబుతూనే, బద్రి, జానీ మూవీలను గుర్తుచేసినందుకు ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్నారు పవర్‌ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahmastra 2: బ్రహ్మాస్త్ర సీక్వెల్ షూటింగ్ అప్‌డేట్ రివీల్

Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

Srelelela: టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు

Follow Us