Rashmika Mandanna: ఇదో మోసం అడ్డంగా దొరికిపోయిన రష్మిక..
నేము.. ఫేము.. వచ్చాక ఓ సెలబ్రిటీ చుట్టూ.. MNC కంపెనీలు.. వెంటపడడం, వారి బ్రాండ్‌నో.. లేక ప్రొడక్ట్నో ప్రమోట్ చేసుకోవడం కామన్. అయితే ఈ కామన్‌లోనూ.. సెలబ్రిటీలు తమ ఇష్టాఇష్టాలు మరిచి.. ఆయా బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం వెరీ వెరీ కామన్. అయితే సెలబ్రిటీలందరూ..
నేము.. ఫేము.. వచ్చాక ఓ సెలబ్రిటీ చుట్టూ.. MNC కంపెనీలు.. వెంటపడడం, వారి బ్రాండ్‌నో.. లేక ప్రొడక్ట్నో ప్రమోట్ చేసుకోవడం కామన్. అయితే ఈ కామన్‌లోనూ.. సెలబ్రిటీలు తమ ఇష్టాఇష్టాలు మరిచి.. ఆయా బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం వెరీ వెరీ కామన్. అయితే సెలబ్రిటీలందరూ.. దాదాపు బయట పడకుండా చేసే ఈ తంతులో.. తాజాగా అడ్డంగా బుక్ అయ్యారు రష్మిక. మెక్‌డోనాల్డ్స్ స్పైసీ చికెన్ బర్గర్‌ను ప్రమోట్ చేస్తూ పప్పులో కాలేశారు. నెటిజెన్లకు మళ్లీ దొరికిపోయి.. సోషల్ మీడియలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఎస్! నేషనల్ క్రష్ గా మారిన తరువాత అటు స్టార్ హీరోల సినిమాల్లోనూ.. ఇటు యాడ్స్ షూట్స్‌లోనూ తెగ బిజీగా మారి పోయిన రష్మిక.. ఇటీవల మెక్‌డోనాల్డ్స్‌కు యాడ్ చేశారు. అందులో మెక్‌డోనాల్డ్స్ piri piri mcspicy చికెన్ బర్గర్‌ను ప్రమోట్ చేశారు. డిలీషియస్ గా ఉన్న బర్గర్‌ను స్లోమోషన్లో ఆస్వాదిస్తూ.. అందరికీ ఊరిళ్లు పుట్టించేలా చేశారు. ఆ యాడ్‌లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ట్రెండ్ అవ్వడమే కాదు ఈ యాడ్ కారణంగా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పాటు నెటిజెన్లకు అడ్డంగా దొరికిపోయారు. రష్మిక ప్యూర్ వెజీ కదా.. నాన్ వెజ్ బర్గర్ తినడం ఏంటనే డౌట్ అందర్లో ఇన్‌స్టెంట్‌గా పుట్టేలా చేసి.. నవ్వుల పాలయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
60 ఏళ్ల వయసులో ఇదేం పని పెద్దాయనా !! ఎట్టకేలకు పోలీసులకు
ఈ కుక్క పిల్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే.. మాయలో పడినట్లే
చిన్న జీవి.. చిరుతకు కూడా లొంగదు.. దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణమే దీనికి రక్షణ
