Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది

Updated on: Jan 23, 2026 | 7:11 PM

రణ్ వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ 'ధురంధర్' సీక్వెల్, 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19, 2026న విడుదల కానుంది. ఈ క్రేజీ సీక్వెల్ టీజర్‌కు సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్ లభించింది. 1 నిమిషం 48 సెకన్ల నిడివి గల ఈ టీజర్ భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉందని తెలుస్తోంది. సన్నీ డియోల్ 'బోర్డర్ 2' సినిమా థియేటర్లలో ఈ టీజర్ విడుదల కానుంది.

రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజై నెలన్నర రోజులు గడిచినా, థియేటర్లలో ఇప్పటికీ ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. ‘ధురంధర్’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇక ‘ధురంధర్’ క్లైమాక్స్ లో ఈ మూవీ రెండవ భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు సీక్వెల్ తేదీని కూడా ప్రకటించారు. రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడీ క్రేజీ సీక్వెల్ టీజర్ గురించి అప్డేట్ బయటికి వచ్చింది. దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకుల నాడిని బాగా తెలుసుకున్నాడు. అందువల్ల, ప్రేక్షకుల నుంచి ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ రాకుండ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్‌ను మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా రూపొందించాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికేట్ లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జనవరి 19న ఈ టీజర్‌ను ఆమోదించి A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ టీజర్ డ్యూరేషన్ దాదాపు 1 నిమిషం 48 సెకన్లు. మొదటి పార్ట్ కు మించి ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చూపించనున్నారని టాక్. అంతేకాదు ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్‌ను సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ సినిమా థియేటర్లలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే, బోర్డర్ 2 సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులు, విరామం సమయంలో లేదా ప్రారంభంలో ధురంధర్ 2 టీజర్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇక బోర్డర్ సినిమా జనవరి 23 ప్రేక్షకుల ముందుకు రానుంది. కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడుల తర్వాత నిఘా సంస్థల కార్యకలాపాల కథ ఆధారంగా ధురంధర్ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ మూవీపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు

Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో

Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లిపై రష్మిక నాటీ ఆన్సర్

గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపిరి పీల్చుకుంటున్న యంగ్ హీరోలు

Tamannaah Bhatia: స్పీడు పెంచిన మిల్కీ బ్యూటీ.. కేకపెట్టిస్తున్న కమ్ బ్యాక్