Ram Pothineni: కొత్త అవతారంలో రామ్.. తొలి సినిమాతోనే డేంజరస్ ఎక్స్‌పరిమెంట్

Edited By:

Updated on: May 18, 2026 | 7:37 PM

ఇన్నాళ్లు నటుడిగా అలరించిన రామ్ పోతినేని ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ‘RAPO23’ పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కొత్త బ్యానర్ RAPO Cinematics ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇన్నాళ్లూ నటుడిగా సత్తా చూపించిన రామ్.. ఇకపై కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికే ఆయనలోని రైటర్, సింగర్‌ను పరిచయం చేసిన రామ్.. ఈసారి దర్శకుడిని కూడా పరిచయం చేస్తున్నారు. మరి ఎనర్జిటిక్ స్టార్ ఏ జోనర్ కథతో మెగాఫోన్ పడుతున్నారు.. సింపుల్‌గా లవ్ స్టోరీ చేస్తున్నారా లేదంటే ఏదైనా కాంప్లికేటెడ్ కథతో రాబోతున్నారా..? యాక్టర్ రామ్ కాస్తా డైరెక్టర్ అయిపోయారు. ‘RAPO23’ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. ఇన్నాళ్లు ఇతరుల కథల్లో నా మొహం చూశారు.. ఇకపై నా కథలో నా గొంతు వింటారు అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు రామ్. ఈ లుక్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. పైగా తొలి సినిమాతోనే సెన్సేషనల్ ఎక్స్‌పర్మెంట్ చేయబోతున్నారు ఎనర్జిటిక్ స్టార్. దర్శకుడు అంటే రెగ్యులర్ కథతో వస్తారేమో అనుకున్నారు కానీ.. ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్. ఇందులో వీర అనే డిఫరెంట్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఉత్కంఠ రేపుతుంది. సినిమాపై సరికొత్త వైబ్స్ క్రియేట్ చేస్తుంది. సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ ఉన్నా.. రాపో సినిమాటిక్స్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసి ఆశ్చర్యపరిచారు రామ్. ఈ ప్రతిష్టాత్మకమైన డెబ్యూ ప్రాజెక్టును రామ్ సోదరుడు కృష్ణ పోతినేని స్వయంగా నిర్మిస్తూ తమ్ముడి విజన్‌కు పూర్తి స్థాయిలో అండగా నిలబడబోతున్నారు. ఆర్నెళ్లలో షూట్ పూర్తి చేసి.. డిసెంబర్‌లో సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు రామ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

Loading...
Unable to load recommendations.
Follow Us