Rajinikanth – Kamal Haasan: ఒకే స్టూడియోలో షూటింగ్‌ తో ట్రెండింగ్‌లో కమల్‌హాసన్‌, రజినీకాంత్‌ వీడియో.

|

Nov 24, 2023 | 11:55 AM

సౌత్‌ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు ఉలగనాయగన్‌ కమల్‌హాసన్ , సూపర్ స్టార్ రజినీకాంత్ ‌. ఈ ఇద్దరూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తలైవా, కమల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటే ఆ క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి దృశ్యమే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇలా ఒక్క చోట చేరేందుకు కారణమేమై ఉంటుందనుకుంటున్నారా..? ఈ ఇద్దరి సినిమాల షూటింగ్ ఒకే స్టూడియోలో జరుగుతోంది.

సౌత్‌ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు ఉలగనాయగన్‌ కమల్‌హాసన్ , సూపర్ స్టార్ రజినీకాంత్ ‌. ఈ ఇద్దరూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తలైవా, కమల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటే ఆ క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి దృశ్యమే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇలా ఒక్క చోట చేరేందుకు కారణమేమై ఉంటుందనుకుంటున్నారా..? ఈ ఇద్దరి సినిమాల షూటింగ్ ఒకే స్టూడియోలో జరుగుతోంది. కమల్‌హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్‌ 2లో నటిస్తుండగా.. తలైవా 170లో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్. షూటింగ్‌ విరామంలో కొన్ని క్షణాలపాటు ఇలా కలిసి సందడి చేశారు.

ఆ తర్వాత ఎవరి షూటింగ్‌కు వాళ్లు వెళ్లిపోయారు. 21 ఏళ్ల తర్వాత రజినీకాంత్‌, కమల్ హాసన్‌ సినిమాలు ఒకే స్టూడియోలో ఒకేసారి షూటింగ్ జరుపుకోవడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు గ్లోబల్‌ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ఇండియన్ 2. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్‌ 2 గ్లింప్స్‌ నెట్టింట హల్ చల్‌ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తుండగా.. చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్‌ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి తలైవా 170 . జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే తలైవా 170 సెట్స్‌లో నుంచి రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ స్టిల్‌ను మేకర్స్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.