మరో వారంలో డార్లింగ్ సినిమా పాట విడుదల
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ది రాజా సాబ్ చిత్రం నుంచి తొలి పాట మరో వారం రోజుల్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సంక్రాంతికి దళపతి విజయ్ జననాయగన్ కూడా పోటీలో ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ చిత్రం ది రాజా సాబ్ గురించి ఆసక్తికర అప్‌డేట్ విడుదలైంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ చిత్రం ది రాజా సాబ్ గురించి ఆసక్తికర అప్‌డేట్ విడుదలైంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి తొలి పాట మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఒకసారి ఈ పాట విడుదలైన తర్వాత, బ్యాక్ టు బ్యాక్ మరిన్ని పాటలు రానున్నాయని తమన్ తెలిపారు. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని చిత్రబృందం చెబుతోంది. పక్కా వీఎఫ్‌ఎక్స్ కోసమే ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల ఆరోగ్యం.. క్యాన్సర్ నివారణ ఆధునిక చికిత్స
Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు
H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా
