Pushpa 2: కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

Updated on: Nov 29, 2024 | 1:29 PM

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ ఉండటంతో పుష్ప ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించారు…తాజాగా కేరళలోని కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించారు. కేరళలో బన్నీ సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్.

కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో కేరళలో జరగుతున్న ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఎప్పటిలానే బన్నీ క్రేజ్‌ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. గత 20 సంవత్సరాలుగా కేరళ అభిమానులు చూపిస్తున్న ప్రేమకు బన్నీ థ్యాంక్స్ చెప్పారు. పుష్పలో ఫాహాద్ పాజిల్‌తో వర్క్ చేయడం ఆనందకరమన్నారు. ఆర్య సినిమాతోనే మలయాళంలో కూడా తనకు మార్కెట్ మొదలైందని అల్లు అర్జున్ చెప్పారు. ఈ సందర్భంగా కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ మొదట్లో మలయాళం లిరిక్స్ ఉంటాయన్నారు. అన్ని భాషల్లోనూ ఆ పాటలో లిరిక్స్ మళయాళంలోనే ఉంటాయని బన్నీ వెల్లడించారు. అలాగే ఆ పాట ప్రోమోని కూడా అక్కడ ప్లే చేశారు. అయితే ఇప్పుడీ ప్రోమో క్లిప్ నెట్టింట వైరల్ అవడంతో.. ఇది బన్నీ తన కేరళ ఫ్యాన్స్‌కి ఇచ్చిన సర్‌ప్రైజ్‌ అండ్ స్పెషల్ గిఫ్ట్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పుష్ప2 నుంచి బయటికి వచ్చిన ఆ మలయాళీ బిట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??

Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్‌ ముచ్చట!

కోటీశ్వరురాలైనా .. చర్మం మెరుపుకి వంటింటి చిట్కాలే

Published on: Nov 29, 2024 01:28 PM
Loading...
Unable to load recommendations.
Follow Us