Puri Jagannadh: డిప్రెషన్‌ కూడా మంచిదే

Updated on: May 15, 2026 | 2:44 PM

దర్శకుడు పూరి జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’లో డిప్రెషన్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిప్రెషన్ కేవలం బాధ మాత్రమే కాదు, మనల్ని మనం కొత్తగా అర్థం చేసుకునే అవకాశం కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు. జిమ్ క్యారీ, లేడీ గాగా, అబ్రహాం లింకన్ వంటి ప్రముఖుల జీవితాలను ఉదాహరణగా చూపిస్తూ, కుంగుబాటును జయించి గొప్ప స్థాయికి ఎదగవచ్చని పూరి పేర్కొన్నారు.

సామాజిక అంశాలైనా, వ్యక్తిగత భావోద్వేగాలైనా దర్శకుడు పూరి జగన్నాథ్ విశ్లేషణ చాలా భిన్నంగా ఉంటుంది. తాజాగా ఆయన ‘పూరి మ్యూజింగ్స్’ వేదికగా ‘డిప్రెషన్’ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిప్రెషన్ అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, అది మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకునే ఒక అవకాశం అని ఆయన సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. పూరి మాటల్లోనే చెప్పాలంటే.. “ఉరుకుల పరుగుల జీవితంలో డిప్రెషన్ మనల్ని కాసేపు ఆపుతుంది. లోకం నుంచి మనల్ని మనం వేరు చేసుకుని ఒంటరిగా కూర్చున్నప్పుడు, మన ఆలోచనలు లోతుగా సాగుతాయి. మనం వెళ్తున్న దారి సరైనదేనా? ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఏ బంధాలు మనకు ముఖ్యం? అనే విషయాలపై ఒక నిజాయతీ గల విశ్లేషణ మొదలవుతుంది. ఈ స్థితి మనలో సహానుభూతిని పెంచుతుంది. ఇతరుల బాధను అర్థం చేసుకునే హృదయాన్ని ఇస్తుంది. బంధాలు మెరుగుపడతాయి. మీరు ఆర్టిస్ట్‌, రైటర్‌గానీ అయి ఉంటే డిప్రెషన్‌ తర్వాత మీ పని మరింత బాగుంటుంది’’. అయితే డిప్రెషన్‌ పూర్తిగా మంచిదని అనుకోవద్దు. దీని ప్రభావం నిద్రపై పడుతుంది. ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. డిప్రెషన్‌ వల్ల వచ్చే బాధ తక్కువగా ఉంటేనే మంచిది. ఎక్కువగా ఉంటే మంచిదికాదు. ఆ బ్యాలెన్స్‌ మనమే చూసుకోవాలి. మీ ఫీలింగ్స్‌, కష్టాలు నిజమే గానీ శాశ్వతం కాదు. కటిక పేదరికంలో పుట్టిన పిల్లాడు.. బాల్యంలో చాలా డిప్రెషన్‌కు గురయ్యాడు. పేదరికాన్ని మర్చిపోయేందుకు అందరినీ నవ్వించడం మొదలుపెట్టాడు. అతడే జిమ్‌ క్యారీ. తనను అందరూ తిరస్కరిస్తున్నారని ఓ అమ్మాయి ట్రామాలోకి వెళ్లిపోయింది. తర్వాత తన బాధను పాటల్లో కలిపేసింది. ఆమే లేడీ గాగా. ఏ ఎన్నికలో పోటీ చేసినా ఎవరూ ఓటు వేసే వారు కాదు. క్రానిక్‌ డిప్రెషన్‌తో బాధపడే వాడు. తర్వాత ప్రపంచంలో గొప్ప లీడర్‌ అయ్యాడు. అతని పేరు అబ్రహాం లింకన్‌’’ తీవ్రమైన కుంగుబాటును తట్టుకుని ఉన్నతస్థాయికి ఎదిగిన వీరి జీవితాలే అందుకు నిదర్శనం అని గుర్తుచేశారు పూరీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏసీ రిమోట్‌లో ఈ బటన్‌ నొక్కితే.. సగం కరెంటు బిల్లే

పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

కందిపప్పు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..

అరుదైన ‘నేల మామిడి’ని చూశారా?

బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌక ప్లాన్.. రూ. 225కే అపరిమిత డేటా, కాలింగ్

Follow Us