Puneeth Raj Kumar: పునీత్ రాజ్‌కుమార్‌ ఇంట మరో విషాదం(Video)

Updated on: Feb 22, 2022 | 8:15 AM

కన్నడ పవర్ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు.

కన్నడ పవర్ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణించిన కొన్ని నెలల్లోనే ఆయన మామగారు ఆకస్మాత్తుగా చనిపోవడంతో అప్పు కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. పునీత్ మరణించిన తర్వాత రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అయితే అప్పటి నుంచే కాస్త ఆనారోగ్యంగా ఉన్న ఆయన ఫిబ్రవరి 20న గుండెపోటుతో మరణించారు. రాజ్‌కుమార్ తరహాలోనే ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపటికే మరణించాడు. ఇక ఈ విషయాన్ని వైద్యులు నిర్థారిస్తూ మీడియాకు తెలియజేశారు.