భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

Updated on: Jun 23, 2025 | 7:35 PM

ఇండస్ట్రీలో ప్రేమకోసం, పెళ్లి కోసం మతం మార్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో ప్రీతి ఒకరు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ సెలబ్రిటీ.. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత భర్త తనను ముస్లిం మతంలోకి మారిపోమ్మని బలవంతపెట్టాడని ఆరోపించింది.

పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడని.. తాజాగా బయటపెట్టింది. తన జీవితం దుర్భరంగా మారిపోయిందంటూ రివీల్ చేసింది. దీంతో బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది ప్రీతి. హిందీ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి.. తన కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు అభిజీత్ పెట్కర్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే అభిజీత్‌ పెట్కర్‌ను హిందూ అనుకున్న ప్రీతి.. దాదాపు మూడేళ్లు రిలేషన్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ కట్ చేస్తే పెళ్లి తర్వాత అభిజీత్ ముస్లిం అని అసలు విషయం తెలిసిందని.. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అర్థమైందంటూ చెప్పింది ప్రీతి. పెళ్లి తర్వాత హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని తనను ఒత్తిడి చేశాడని తెలిపింది. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను విపరీతంగా కొట్టేవాడు అని తెలిపింది. భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయిందట. చివరకు చావు అంచులవరకు వెళ్లివచ్చిందట. ఇక ఇదే విషయాన్ని ప్రీతీ తల్రేజా తాజాగా సోషల్ మీడియాలో బయటపెట్టింది. తన భర్త గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను పెట్టే చిత్రహింసల గురించి వివరిస్తూ.. తనకు న్యాయం చేయమని అధికారులను కోరింది. PMO అండ్ థానే పోలీసులను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది. దీంతో ఈమె ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ ఐడియా.. రిక్షా తొక్కలేక అతనేం చేశాడంటే..!

మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే.. పట్టిందల్లా బంగారమే

పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా

వేసవి తాపం నుంచి తప్పించుకోడానికి ఇతని ఐడియా అదుర్స్‌

ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే అద్భుతమైన ప్రయోజనాలు