Dragon: ‘డ్రాగన్’ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్.. తారక్ డెడికేషన్ చూసి షాక్ అయిన ప్రశాంత్ నీల్

Edited By:

Updated on: May 22, 2026 | 4:08 PM

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ టీజర్‌లో తారక్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ మేకోవర్ కోసం ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గారని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. క్యారెక్టర్ కోసం తారక్ చూపించిన అంకితభావం తనను ఆశ్చర్యపరిచిందని, ఆయన మరీ స్లిమ్‌గా కనిపించడంతో అభిమానులు తననే విమర్శించారని నీల్ చెప్పారు.

ఎన్టీఆర్ డ్రాగన్‌ టీజర్‌ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌లో తారక్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ మేకోవర్ వెనుక చాలా కష్టం ఉందంటున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. అంతేకాదు, తారక్ వెయిట్ లాస్ జర్నీ తన మీద కూడా గట్టిగానే ఎఫెక్ట్ చేసిందని గుర్తు చేసుకున్నారు. ఎలా అనుకుంటున్నారా.? అయితే వాచ్ దిస్ స్టోరి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్‌. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ లుక్ మీద చాలా విమర్శలు వినిపించాయి. తారక్‌ భారీగా వెయిట్ తగ్గటంతో ఆయన ఆరోగ్యం విషయంలోనూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా తారక్ వెయిట్ లాస్ జర్నీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ప్రశాంత్ నీల్‌. సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నప్పుడు తారక్‌ను కొంచెం వెయిట్ తగ్గమని కోరారట ప్రశాంత్ నీల్. ఆ మాటను సీరియస్‌గా తీసుకున్న ఎన్టీఆర్‌ ఏకంగా నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గారు. ఆ టైమ్‌లో ప్రశాంత్ నీల్ స్వయంగా వద్దని వారించినా.. కథ కోసం ఇంకాస్త స్లిమ్‌గా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో ఎన్టీఆరే మరింత స్లిమ్‌ అయ్యారని గుర్తు చేసుకున్నారు. క్యారెక్టర్‌ కోసం ఇంత మొండిగా కష్టపడే నటుడ్ని తాను ఇంతవరకు చూడలేదనన్నారు ప్రశాంత్ నీల్. అయితే తారక్ మరీ స్లిమ్‌గా కనిపించటంతో అభిమానులతో పాటు తన స్టాఫ్‌ కూడా తననే తిట్టారని గుర్తు చేసుకున్నారు ఈ మాస్ డైరెక్టర్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Follow Us