The Raja Saab Trailer: ‘ది మోస్ట్ అవైటెడ్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది . అయితే సినిమా రిలీజ్ కు వంద రోజులు ఉండగానే ది రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలే మిరాయ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Published on: Sep 29, 2025 06:38 PM
