Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. మళ్లీ మారిన ఆ డేట్..!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. మార్చి 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’తో సంబంధం ఉన్న టీ-సిరీస్ తన మరో చిత్రం ‘ఖోస్లా కా ఘోస్లా 2’ను అదే తేదీకి ప్రకటించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున కొత్త విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
స్పిరిట్ రిలీజ్ డేట్ మారడం ఖాయమైపోయిందా..? మార్చి 5న ఈ సినిమా రానట్లేనా..? ఒకవేళ అదే నిజమైతే స్పిరిట్ న్యూ డేట్ ఏంటి..? ఈ యాక్షన్ డ్రామా వాయిదాను మేకర్స్ ఇన్‌డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేసారా..? అసలు స్పిరిట్ డేట్ చేంజ్ వెనుక అసలు కథేంటి..? స్పిరిట్ వాయిదా దాదాపు ఖరారైపోయింది.. ఆ సినిమాలో పార్ట్నర్గా ఉన్న టీ-సిరీస్.. తమ మరో సినిమా ‘ఖోస్లా కా ఘోస్లా 2’ను మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన అదేరోజు రావాల్సిన ‘స్పిరిట్’ వాయిదా పడ్డట్లే. సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది షాకే. నిజానికి మార్చి 5 టార్గెట్‌గానే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ షూటింగ్‌ను పక్కా ప్లానింగ్‌తో స్పీడ్‌గా చేస్తూ వచ్చారు. కానీ డిసెంబర్లో రావాల్సిన ఫౌజీ వాయిదాల మీద వాయిదా పడటంతో మార్చి రిలీజ్‌పై కన్నేసింది. దాంతో ఆప్షన్ లేక స్పిరిట్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఫౌజీ రిలీజ్ డేట్‌తో పాటు స్పిరిట్ సినిమాపై కూడా ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ డేట్ లాక్ కాకపోతే, కేవలం బర్త్‌డే విషెస్ మాత్రమే చెప్పి కొత్త తేదీపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి డార్లింగ్ పుట్టినరోజున మేకర్స్ ఏ క్లారిటీ ఇస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువని తెలుసా
హైదరాబాద్–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!
విమానంలో షాకింగ్ ఘటన.. ఫ్లైట్ అటెండెంట్‌ను కొరికిన నటి
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..