The Raja Saab Pre Release Event: గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఎంట్రీ చూశారా? వీడియో

Updated on: Dec 27, 2025 | 9:50 PM

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ది రాజా సాబ్’. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) ది రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గ నిర్వహిస్తున్నారు.

ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని కైతల పూర్ గ్రౌండ్ లో జరుగుతోన్న ఈ వేడుకకు చిత్ర బృందమంతా తరలివచ్చింది. ఇక ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జనాల ముందుకు వస్తుండటంతో అభిమానులు భారీగా హాజరయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. గుబురు గడ్డం, పిలక జుట్టుతో సరికొత్త లుక్ లో అదరగొట్టాడు డార్లింగ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా మారుతి దర్శకత్వంలో రూపొందిన  కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్‌ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ కథానాయికలుగా నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ప్రభాస్ తన తర్వాతి సినిమా స్పిరిట్ కోసమే ఇలా పిలక జుట్టును పెంచుకుంటున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Published on: Dec 27, 2025 09:36 PM