Hari Hara Veera Mallu: అటకెక్కిన హరిహర..! వస్తుందా రాదా..? క్రిష్ అప్డేట్ ప్లీజ్..!

|

Aug 18, 2023 | 8:12 AM

బ్రో అయిపోయింది. ఉస్తాద్ అవుతోంది. ఓజీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. మరి వాట్ ఎబోట్ హరిహర వీర మల్లు. అది ఎక్కడి వరకు వచ్చింది. అసలు ఆ సినిమా అవుతోందా..? లేక ఓ మూలకు పడిందా? లేక ముక్కుతూ మూలుగుతూ అయినా.. ఇంకో రెండేళ్లకు మన ముందుకు వస్తుందా? అనే డౌట్సే అండ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఈ సినిమా అప్డేట్స్ పై ఆరా తీసేలా చేస్తున్నాయి.

బ్రో అయిపోయింది. ఉస్తాద్ అవుతోంది. ఓజీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. మరి వాట్ ఎబోట్ హరిహర వీర మల్లు. అది ఎక్కడి వరకు వచ్చింది. అసలు ఆ సినిమా అవుతోందా..? లేక ఓ మూలకు పడిందా? లేక ముక్కుతూ మూలుగుతూ అయినా.. ఇంకో రెండేళ్లకు మన ముందుకు వస్తుందా? అనే డౌట్సే అండ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఈ సినిమా అప్డేట్స్ పై ఆరా తీసేలా చేస్తున్నాయి. క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్లో.. ఏఎమ్ రత్నం ప్రొడక్షన్లో.. తెరకెక్కుతున్న సినిమానే హరి హర వీరమల్లు. ఎప్పుడూ లవ్‌ అండ్ యాక్షన్ జోనర్లో సినిమాలు చేసే పవర్ స్టార్.. ఫర్ ది ఫస్ట్ టైం.. ఓ పీరియాడికల్ డ్రామాను పిక్ చేసుకోవడం.. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో వస్తుండడంతో.. అనౌన్స్‌మెంట్ అప్పుడే ఈసినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ.. గజదొంగగా.. బయటికి వచ్చిన పవన్‌ లుక్స్‌ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలనే కోరికను.. ఫ్యాన్స్‌లో బలంగా పుట్టేలా చేశాయి. లుక్స్‌కు తోడు.. షూట్ లోకేషన్లో స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్‌ పిక్స్‌ ఈ సినిమాపై ఎన్న అంచనాలను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇక ఇవన్నీ తోడై.. ఈ సినిమా రికార్డ్‌ లెవల్‌ బిజినెస్ చేస్తుందనే టాక్‌ను ఇండస్ట్రీలో పుట్టుకొచ్చేలా చేశాయి.

కానీ కట్ చేస్తే..! పవన్‌ రాజకీయాల్లో బిజీ అవడంతో.. ఈ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదించింది. అందులోనూ ఈసినిమా భారీ సెట్టింగ్స్‌తో.. టిపికల్ సీజీ వర్క్స్‌తో కూడుకుని ఉండడంతో.. పవన్‌ డేట్స్‌ ఎక్కువ కావాల్సి వచ్చింది. దానికి తోడు.. గజదొంగ క్యారెక్టర్‌ కోసం మేకోవర్స్ అవ్వడం.. పవన్‌ రిమైనింగ్ సినిమాలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి పక్కకు పెట్టారట పవన్‌ కళ్యాణ్. ఈ సినిమా బదులు.. ఆ డేట్స్‌తో.. అటు ఉస్తాద్ సినిమాను.. ఇటు ఓజీ సినిమాను ఫినిష్‌ చేస్తున్నారట. ఇక ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ అవడంతో.. ఫ్యాన్స్‌ ఈ సినిమా పై.. ఫ్యాన్స్ కాస్త ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆటలో అరటిపండంటూ.. అటకెక్కిన హరిహర అంటూ.. మీమ్స్ చేస్తూ.. నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...