Pooja Hegde: వరుస ఆఫర్లతో మళ్లీ బిజీ అవుతున్న బుట్టబొమ్మ
వరుస ఫ్లాపులతో వెనుకబడిన పూజా హెగ్డే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతోంది. దుల్కర్ సల్మాన్‌తో ‘శ్రీశ్రీ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ భామకు రవితేజ, అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్-బన్నీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కితే పూజా కెరీర్‌కు మరోసారి భారీ ఊపు రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఒకప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే.. కొన్నేళ్లుగా ఏ సినిమాకైనా డేట్స్ ఇస్తాననే పరిస్థితికి వచ్చేసారు. ఈ మధ్య ఈమె టైమ్ ఏమంత బాగోలేదు. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. చూస్తుంటే రాబోయే ఏడాది పూజా హెగ్డే సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా ఉంది. మరి ఈమె కమ్ బ్యాక్ ఎలా ఉండబోతుందో చూద్దామా..? రెండు మూడేళ్ల కింది వరకు పూజా హెగ్డేకు తెలుగులో గోల్డెన్ టైమ్ నడిచింది. హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం ఈమెనే అన్నట్లుండేది పరిస్థితి. కానీ వరస ఫ్లాపులతో కెరీర్‌లో వెనకబడ్డారు పూజా. ప్రస్తుతం కమ్ బ్యాక్ కోసం కష్టపడుతున్నారు. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ సినిమాతో చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ను పలకరిస్తున్నారు పూజా హెగ్డే. దీని తర్వాత వరస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. రవితేజతో కూడా ఓ సినిమాలో నటించే అవకాశం పూజాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈయన హసిత్ గోలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో పూజా పేరు బాగా వినిపిస్తుంది. ఇది ఇంకా కన్ఫర్మ్ కాకుండానే.. లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలే వీళ్లది బాక్సులు బద్దలైపోయే జోడీ. గతంలో బన్నీ, పూజా నటించిన డిజే, అల వైకుంఠపురములో దుమ్ము దులిపేసాయి. మిగిలిన హీరోలకెలా ఉన్నా.. అల్లు వారబ్బాయికి మాత్రం పూజా లక్కీ హీరోయినే. అందుకే లోకేష్‌తో చేయబోయే AA23 కోసం ఈమెపై లుక్ టెస్ట్ పూర్తైందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే పూజా 2.0 మొదలైనట్లే. మొత్తానికి చూడాలిక.. ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం
