Peddi: పెద్ది డబుల్ డోస్.. ఫ్యాన్స్‌లో కొత్త జోష్

Edited By:

Updated on: May 10, 2026 | 5:08 PM

పెద్ది సినిమా విడుదల తేదీ సమీపిస్తుండగా, మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. 80వ దశకంలో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే భావోద్వేగ డ్రామా ఇది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం భారీ ఈవెంట్, రెండు ట్రైలర్‌లు సిద్ధమవుతున్నాయి. మే 8 నుండి USA బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

పెద్ది విడుదలకు మరో నెల రోజుల టైమ్ కూడా లేదు.. దాంతో ప్రమోషన్స్‌లో మాత్రమే కాదు ప్రణాళికల్లోనూ వేగం పెంచేసారు మేకర్స్. దానికోసం సపరేట్‌గా షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నారు. అన్నింటికీ మించి పెద్ది కథపై పెద్ద క్లారిటీ వచ్చింది. ఇవన్నీ ఉండగానే ట్రైలర్ లాంఛ్ కోసం మేజర్ సర్‌ప్రైజ్ ఉండబోతుంది. ఈ అప్‌డేట్స్ అన్నీ ఒకే స్టోరీలో కవర్ చేద్దాం పదండి.. పెద్ది సినిమా రిలీజ్ డేట్ చూస్తుండగానే దగ్గరికి వచ్చేస్తుంది. మరో నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు మేకర్స్. మే 8 నుంచి USA బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. నార్త్ అమెరికాలో రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేసారు ప్రత్యంగిరా సినిమాస్. నార్మల్ స్క్రీన్స్‌తో పాటు సినీమార్క్ XD, RPX వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్స్‌‌లో పెద్ది విడుదల కానుంది. ఇండియాలోనూ పెద్ది ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా గురించి మేజర్ అప్‌డేట్స్ ఇచ్చారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రంగస్థలం తరహాలోనే పెద్ది కూడా 80వ దశకంలో సాగుతుందని.. కథ అంతా ఉత్తరాంధ్రలో జరిగే స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పారు అవినాష్. కన్నీళ్లు పెట్టించే హై రేంజ్ ఎమోషనల్ డ్రామా అంటూ హింటిచ్చారీయన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ కూడా లాక్ అయిపోయింది.. ఆర్ఆర్ కూడా మొదలైపోయింది. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లాంఛ్ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు పెద్దికి ఒకటి కాదు రెండు ట్రైలర్స్ కట్ చేయబోతున్నారు మేకర్స్. పెద్ది సినిమా ఎడిటింగ్ కూడా లాక్ అయిపోయింది. ఆర్ఆర్ అయిపోతే.. ఫస్ట్ కాపీ మే సెకండ్ వీక్ నాటికి రెడీ అయిపోనుంది. ఆలోపే ట్రైలర్ లాంఛ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూన్ 4న సినిమా రానుంది కాబట్టి వారం ముందే ప్రీ రిలీజ్ కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి రాబోయే 25 రోజులు పెద్ది యూనిట్‌కు కంటి మీద కునుకుండదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు

పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి

Follow Us