Akira Nandan: అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్
సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌పై డీప్‌ఫేక్ AI వీడియో సృష్టించిన వ్యక్తిని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అకీరా అనుమతి లేకుండా 56 నిమిషాల తప్పుడు వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. తన ఫోటోలు, పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని అకీరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. AI దుర్వినియోగం తీవ్ర నేరమని, సెలబ్రిటీలు, సామాన్యుల ఫేక్ వీడియోల సృష్టిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌పై ఏఐ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల ఒక వీడియోను క్రియేట్ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారు. పోలీసుల విచారణలో కూడా తప్పుడు రీతిలో డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీలతో పాటు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా కామన్ వ్యక్తులకు సంబంధించిన ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: దటీజ్ ప్రభాస్.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
New OTT Releases: ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు..మరిన్ని ఇంట్రెస్టింగ్ OTT రిలీజ్ డీటైల్స్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? రోడ్డు కోసం గుర్రాలపై వెళ్లి వినతి పత్రం
