Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది..! పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Updated on: Sep 22, 2025 | 11:31 AM

సినిమాలు రాజకీయాలు వేరన్న పవన్‌... సినిమాలు చేస్తున్నప్పుడు కేవలం సినిమాల గురించే ఆలోచిస్తానన్నారు. ఇటు పాలిటిక్స్‌ చేసేటప్పుడు పాలిటిక్స్‌ తప్ప మరో ఆలోచన ఉండన్నారు. ఓజీ కన్సర్ట్‌లో కత్తి పట్టిన పవన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయానన్నారు.

పక్కా గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తోన్న ఓజీ కన్సర్ట్ ఈవెంట్‌ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఓజస్‌ గంభీర కేరక్టర్‌లో కనిపించనున్న పవర్‌స్టార్‌ పవన్‌… ఈవెంట్‌లో రచ్చరచ్చ చేశారు. సినిమా ఫంక్షన్స్‌లో పెద్దగా హడావుడి చేయని పవన్… ఈసారి యమా హుషారుగా కనిపించారు. వింటేజ్‌ లుక్‌లో ఈవెంట్‌ను వచ్చిన ఆయన… అప్పటి స్వాగ్‌ను ఫ్యాన్స్‌కి గుర్తుచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు పవన్‌. ఏ వర్షమూ మనల్ని ఆపలేదు… ఏ ఓటమి మనల్ని వెనక్కి నెట్టలేదంటూ కాస్త పొలిటికల్‌ టచ్‌ ఇస్తూ డైలాగులు పేల్చారు.

సినిమాలు రాజకీయాలు వేరన్న పవన్‌… సినిమాలు చేస్తున్నప్పుడు కేవలం సినిమాల గురించే ఆలోచిస్తానన్నారు. ఇటు పాలిటిక్స్‌ చేసేటప్పుడు పాలిటిక్స్‌ తప్ప మరో ఆలోచన ఉండన్నారు. ఓజీ కన్సర్ట్‌లో కత్తి పట్టిన పవన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయానన్నారు.

మొత్తంగా… ఎన్నో ఏళ్ల తర్వాత ఓ సినిమా ఈవెంట్‌లో పవన్‌ ఇలా హుషారుగా కనిపించడం… అందులోనూ వింటేజ్‌ లుక్‌లో హంగామా చేయడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఫీలవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..

Andhra: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి మేడమ్.. వీఆర్వోతో గుంజీలు తీయించిన లేడీ ఆఫీసర్‌.. ఎందుకో తెలుసా..?

ముక్కులోని వెంట్రుకలు కట్ చేస్తున్నారా..? అయితే, మీ ఊపిరితిత్తులు హాంఫట్..