ధురంధర్ లెగసీని కంటిన్యూ చేసేదెవరు ??
ఈ సమ్మర్‌లో సరిహద్దులు దాటి బజ్ సృష్టిస్తున్న పొరుగు భాషా చిత్రాలను తెలుసుకుందాం. పళ్లి చట్టంబి, లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ధనుష్ 'కర', మోహన్‌లాల్-మమ్ముట్టిల 'పేట్రియాట్' వంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పాన్-ఇండియా చిత్రాలు మన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో, వాటి అంచనాలు ఏంటో ఈ కథనంలో చూడండి.
మన సినిమాల మీద మనకో అంచనా ఉంటుంది. క్రేజ్ ఎలా ఉంది? బజ్ ఏమాత్రం ఉందనే క్లారిటీ ఉంటుంది. మన సినిమాల విషయంలో ఉన్న ఆ క్లారిటీ పొరుగు మూవీస్ మీద కూడా వచ్చిందనుకోండి.. అవి సరిహద్దులు దాటి సౌండ్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు, ఈ సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న అలాంటి సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం… ధురంధర్ ఫస్ట్ పార్టు రిలీజ్ అయినప్పుడు మన దగ్గర చడీ చప్పుడు లేదు. కానీ, ఆ మూవీ థియేటర్లలో ఆడుతున్న కొద్దీ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ పార్ట్ టూ కి హెల్ప్ అయింది. నార్త్, సౌత్, హిందీ, తెలుగు అనే తేడా లేకుండా విజయ దుందుభి మోగించింది. ఆ సినిమా క్లిక్ అయిన రేంజ్‌లో మన దగ్గర మెజారిటీని కొట్టేసే నెక్స్ట్ సినిమా ఏంటనే మాటలు షురూ అయ్యాయి. రేసులో నేనున్నానంటున్నారు మలయాళ హీరో టొవినో థామస్. టొవినో హీరోగా తెరకెక్కింది పళ్లి చట్టంబి. కున్నంపురం అనే ఊరు, ఆ ఊళ్లోని ప్రజలను కాపాడటానికి వచ్చే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. పళ్లి చట్టంబి రిలీజ్ అయిన వెంటనే లైన్లో కనిపిస్తోంది లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. విఘ్నేష్ శివన్ డైరక్షన్‌లో తెరకెక్కింది లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించారు. లవ్ ని ఇన్స్యూర్ చేయడానికి ఇప్పుడు దారి ఉంది అంటూ మొదలయ్యే ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి సినిమా కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తే తిరుగు ఉండదు. ఈ నెలాఖరున పెద్దితో పోటీ పడటానికి కర మూవీతో సిద్ధమవుతున్నారు ధనుష్. ఇంటెన్స్, కేరక్టర్ డ్రైవన్ సస్పెన్స్ డ్రామాగా రూపొందుతోంది కర. ఈ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే బాక్సాఫీస్ మీద దండయాత్రకు బయలుదేరుతున్నారు మోహన్‌లాల్ అండ్ మమ్ముట్టి. ఇద్దరూ కలిసి నటించిన పేట్రియాట్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో.. ఈ సమ్మర్‌లో ఈ పొరుగు చిత్రాలు మన వారిని ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి మరి…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్