ప్రతి సినిమాకు కొత్త అవతారం… స్టార్ హీరోల మేకోవర్ వెనక భారీ కష్టం..!

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:20 AM

పాన్ ఇండియా సినిమాల పెరుగుతున్న స్థాయికి తగ్గట్టుగా స్టార్ హీరోలు ప్రతి చిత్రంలో కొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు భారీ మేకోవర్స్ చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టుల కోసం విభిన్న రూపాల్లో కనిపించనున్నారు. అయితే తరచూ బరువు పెరగడం, తగ్గడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజెంట్ సినిమా ట్రెండ్ మారిపోయింది. ఆడియన్స్ టేస్ట్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో హీరోలు ప్రతీ సినిమాలో ఒకే లుక్‌తో కనిపిస్తామంటే కుదరదు. సినిమా సినిమాకు ఏదో ఒక సర్‌ప్రైజ్‌ ఇవ్వాలి. ఆ సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ కోసమే కష్టపడుతున్నారు స్టార్స్‌. ఇంతకీ హీరోలు పడుతున్న ఆ కష్టం దేని గురించి ఈ స్టోరిలో చూద్దాం. మన సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌ దాటి గ్లోబల్ రేంజ్‌కు వెళుతోంది. అందుకే మన హీరోలు కూడా ఆడియన్స్‌ను అలరించేందుకు కష్టపడుతున్నారు. ముఖ్యంగా ప్రతీ సినిమాలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎప్పుడూ మేకోవర్ మీద పెద్దగా దృష్టి పెట్టని మహేష్ బాబు వారణాసి కోసం స్టైల్ మార్చారు. లాంగ్ హెయిర్‌తో మాస్‌ లుక్‌లో అలరించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైమ్‌ మైథలాజికల్‌ రోల్‌లో నటిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు శ్రీరాముడిగా తెర మీద కనిపించబోతున్నారు. పెద్ది కోసం బల్కీ బాడీతో మాసీగా కనిపించిన రామ్ చరణ్‌, నెక్ట్స్ మూవీ కోసం స్టైల్ మారుస్తున్నారు. సుకుమార్ సినిమాలో క్లాస్‌గా కనిపించబోతున్నారు. డ్రాగన్‌ కోసం తారక్‌ కూడా కంప్లీట్‌గా మేకోవర్ అయి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. రాకా కోసం బన్నీ మేకోవర్‌ గ్లోబల్ రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తోనే ఇంటర్నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యింది అల్లు అర్జున్‌ రాకా. ప్రభాస్‌ మేకోవర్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. ఒక్కో సినిమాకు ఏ మాత్రం సంబంధం లేకుండా డిఫరెంట్ లుక్స్‌ ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్‌. రీసెంట్‌గా రాజాసాబ్‌లో కలర్‌ఫుల్‌గా కనిపించిన డార్లింగ్‌, నెక్ట్స్ ఫౌజీలో వింటేజ్‌ సోల్జర్‌గా డిఫరెంట్ లుక్‌లో కనిపింబోతున్నారు. ఆ తరువాత స్పిరిట్ కోసం రూత్‌ లెస్‌ కాప్‌ మరో డిఫరెంట్ లుక్‌ ట్రై చేస్తున్నారు. హీరోల మేకోవర్‌తో ఆడియన్స్‌ హ్యాపీగా ఉన్నా… ప్రతీ సినిమాకు లుక్ మార్చటం అంత కరెక్ట్ కాదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అంత వేగంగా బరువు పెరగటం తగ్గటం హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుందంటున్నారు. గతంలో ఇలాంటి రిస్క్ చేసిన రానా ఆరోగ్యం పాడు చేసుకున్నారు. అనుష్క కూడా మేకోవర్ కారణంగా కెరీర్‌ ఇబ్బందుల్లో పడేసుకున్నారు. అయినా సరే మన హీరోలు అభిమానుల కోసం ఆ రిస్క్ తీసుకోవడానికే రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: ప్రెగ్నెంట్‌గా ఉండి రిస్కీ స్టంట్స్‌.. దీపిక డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఇండస్ట్రీ

పెళ్లి తర్వాతే అసలైన జోరు… మ్యారీడ్ హీరోయిన్లదే ఇప్పుడు ఇండస్ట్రీలో హవా..!

Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు

Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?

Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్

Follow Us