అకీరా కాదు..ఆదిత్య ! సోషల్ మీడియా దుమ్ముదులుపుతున్న OG కుర్రాడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ చిన్నప్పటి పాత్ర కూడా ఉంది.
జపాన్ లో సమురాయ్ లతో ఉండే పవన్ ఇండియాకు ఎలా వచ్చాడు అనే కథతో ఈ సినిమా మొదలవుతుంది. అయితే ఓజీ రిలీజ్ కు ముందు పవన్ కల్యాణ్ చిన్నప్పటి పాత్ర పవన్ తనయుడు అకిరా నందన్ చేస్తాడని చాలా మంది భావించారు. కానీ అదేమీ జరగలేదు. అకీరా బదులు చైల్డ్ ఆర్టిస్ట్ ఆకాష్ శ్రీనివాస్ తన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు,. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రాడు ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాల్లో మెరిశాడు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కిలోనూ డార్లింగ్ చిన్నప్పటి పాత్రను కూడా ఆకాశే పోషించాడు. దీంతో ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఒక్కసారిగా వైరలయ్యాడు. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ చిన్నప్పటి రోల్ లో సూపర్బ్ గా యాక్ట్ చేశాడు ఆకాశ్. జపాన్ మార్షల్ ఆర్ట్స్ తో ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా చేసాడు. దీంతో నెట్టింట ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతోంది. ఓజీ సినిమా సక్సెస్ తో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు ఆకాశ్. తన మాటలతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు కూడా..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కథలు చిన్నతనంలో విన్నానన్న NTR
విజయవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
