Devara 02: ఒకే మాట.. దెబ్బకు దేవర 2 ట్రెండింగ్

Updated on: Jan 28, 2026 | 2:02 PM

ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర 2 సినిమాపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. నిర్మాతలు స్వయంగా దీనిపై స్పష్టమైన అప్‌డేట్ ఇచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం 2027లో విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ తన ప్రశాంత్ నీల్ సినిమా రెండు భాగాల మధ్య విరామంలో 'దేవర 2'ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ ఏడాదిన్నరగా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. మేలో షూటింగ్ ప్రారంభమవుతుంది.

దేవర 2 సినిమా ఉంటుందా లేదా..? ఎన్టీఆర్ అభిమానుల్లో చాలా కాలంగా ఉన్న అనుమానం ఇదే.. కానీ దీనికి సమాధానం ఇటు కొరటాల నుంచి గానీ.. అటు ఎన్టీఆర్ నుంచి గానీ రాలేదు. దాంతో వాళ్లు కూడా సినిమా లేదనే కన్ఫర్మేషన్‌కు వచ్చేసారు. ఇలాంటి సమయంలో ఊహించని అప్డేట్ వచ్చింది. మరి దేవర 2 ముచ్చట్లేంటి..? వస్తుందా.. వస్తే ఎప్పుడొస్తుంది..? 500 కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత కూడా కొరటాల శివకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలో ఉంది. ఓ వైపు దేవర 2 ఉందని కచ్చితంగా చెప్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 వైపు వస్తారనేది వాళ్ల నమ్మకం. కానీ అది జరుగుతుందా అనే అనుమానమే ఇన్నాళ్లూ ఉండేది. దేవర విజయం సాధించినా.. కేవలం తారక్ స్టామినాతో ఆడింది.. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవర 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలోనే.. ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్లాయనే ప్రచారం కూడా జరిగింది. దేవర 2 సినిమాపై ఇకపై అనుమానాలు అక్కర్లేదు.. దీనిపై స్వయంగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని అప్‌డేట్ ఇచ్చారు. మే నుంచి దేవర 2 సినిమా స్టార్ట్ అవుతుందని.. 2027లో సినిమా విడుదలవుతుందని కన్ఫర్మ్ చేసారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు తారక్. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది. అందులో పార్ట్ 1ను ఇదే ఏడాది విడుదల చేసి.. నెక్ట్స్ పార్ట్ 2027 చివర్లో ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1, 2కి గ్యాప్‌లో దేవర 2 పూర్తి చేయాలని చూస్తున్నారు తారక్. కొరటాల కూడా దీనికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు. మరి దేవర 2తో ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుటుంబ ఆస్తుల చిట్టా బయటపెట్టిన నందమూరి హీరో

జమ్ముకశ్మీర్ లోని సోనామార్గ్ పై విరుచుకుపడ్డ అవలాంచ్

మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్

నా బిడ్డ అమాయకుడు, ఆ మహిళే విలన్

అన్‌స్టాపబుల్‌గా షారుఖ్‌ సాంగ్.. 26ఏళ్లుగా ట్రెండింగ్‌లోనే