కుటుంబ ఆస్తుల చిట్టా బయటపెట్టిన నందమూరి హీరో
నందమూరి చైతన్య కృష్ణ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణ 70ఎంఎం థియేటర్, స్టూడియో, హోటల్ వంటి వారసత్వ ఆస్తుల నిర్వహణ, వాటి ప్రస్తుత పరిస్థితిపై ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ శంషాబాద్ ఫామ్‌ల్యాండ్ విక్రయం, చెన్నైలోని ఇల్లు మ్యూజియంగా మార్పు వంటి విషయాలు ప్రస్తావించారు. బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించతలపెట్టిన 400-500 కోట్ల భారీ ఎన్టీఆర్ మ్యూజియం ప్రణాళికలు కూడా తెలియజేశారు.
సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అరంగేట్రం చేశాడు నందమూరి చైతన్య కృష్ణ. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో మొదటి సారిగా నటించాడు చైతన్య కృష్ణ. దీని తర్వాత చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. అయితే 2023లో మళ్లీ బ్రీత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ ఇండస్ట్రీకి దూరమైపోయాడీ నందమూరి హీరో. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు చైతన్య కృష్ణ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తమ కుటుంబ ఆస్తుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నందమూరి చైతన్య కృష్ణ. నందమూరి తారక రామారావు వారసత్వ ఆస్తుల్లో భాగంగా తమకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్ వచ్చిందంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నందమూరి చైతన్య కృష్ణ. అంతేకాదు తన నాన్న నందమూరి జయకృష్ణ కుటుంబ ఆస్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించేవారన్నారు. రామకృష్ణ 70 MM థియేటర్, 35MM థియేటర్, హోటల్, స్టూడియో వంటి వాటిని చూసుకున్నారన్నారు. తాత ఎన్టీఆర్ శంషాబాద్‌లో 250 ఎకరాల ఫామ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేశారని… దానిని కూడా తన నాన్నే చూసుకున్నారని, అయితే ఆ తర్వాత దాన్ని అమ్మేశారన్నారు. రామకృష్ణ 35MM, రామకృష్ణ గ్లిటరేటి థియేటర్‌లను సాయికృష్ణ నిర్వహిస్తుండగా, హరి బాబాయ్ హోటల్‌ను, మోహన్.. తారక రామ థియేటర్‌ను చూసుకుంటున్నారని చెప్పాడు. ఇక స్టూడియో బాధ్యతలను పూర్తిగా రామకృష్ణ బాబాయ్ కే అప్పజెప్పారని.. ఆయన చూసుకుంటున్నారని చైతన్య కృష్ణ చెప్పాడు. అయితే స్టూడియోలో మాత్రం అందరూ భాగస్వాములుగా ఉన్నామని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చాడు. చిన్న బాబాయ్ జయశంకర్ కృష్ణకు చెన్నైలోని బజుల్లా రోడ్‌లో ఒక ఇల్లు ఉందని.. అలాగే స్టూడియోలో ల్యాండ్, భవనం కూడా ఆయన పేరిట ఉన్నాయన్నాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు మారినందున చెన్నైలోని టీ. నగర్ ఇంటిని మ్యూజియంగా ఏర్పాటు చేశామన్నాడు. ఎన్టీఆర్ వస్తువులతో కూడిన పెద్ద మ్యూజియం అమరావతిలో నిర్మించడానికి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారన్నాడు. దీనికి సుమారు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్టు నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జమ్ముకశ్మీర్ లోని సోనామార్గ్ పై విరుచుకుపడ్డ అవలాంచ్
మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్
నా బిడ్డ అమాయకుడు, ఆ మహిళే విలన్
