18 Pages: రిలీజైన ఫస్ట్ డేనే.. దిమ్మతిరిగేలా లాభాల పంట..

|

Dec 26, 2022 | 9:28 AM

ట్యాలెంట్ ఉండి కూడా... స్టార్ హీరోగా అయ్యే కేపబులిటీ ఉండి కూడా ఎందుకనో వెనక పడ్డారు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నా.. మంచి మంచి కథలను చేస్తూ ఉన్నా..

ట్యాలెంట్ ఉండి కూడా… స్టార్ హీరోగా అయ్యే కేపబులిటీ ఉండి కూడా ఎందుకనో వెనక పడ్డారు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నా.. మంచి మంచి కథలను చేస్తూ ఉన్నా.. వాటితో హిట్లు కొడుతూ ఉన్నా.. స్టార్ ఇమేజ్‌ కు మాత్రం ఆమడదూరంలోనే ఉంటు వస్తున్నారు. కాని ఇది నిన్నమొన్నటి వరకు. ఎప్పుడైతే.. కార్తీకేయ2 సినిమాతో.. పాన్ ఇండియా హిట్టు కొట్టారో అప్పటి నుంచి నిఖిల్ తన గేర్‌ ను మార్చుకున్నారు. స్టార్ హీరో రేసులో దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా రిలీజైన తన 18పేజెస్ సినిమాతో… ఏకంగా నయా రికార్డును క్రియేట్ చేశారు. జెస్ట్ తన సినిమా రిలీజైన ఫస్ట్ డేనే… ఓపెనింగ్ కలెక్షన్స్‌ తోనే బ్రేక్‌ ఈవెన్‌ను సాధించారు. దిమ్మతిరిగే లాభాలు వచ్చేలా చేశారు.

Published on: Dec 26, 2022 09:28 AM