Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Updated on: Feb 24, 2026 | 8:21 PM

నరేష్, పవిత్ర లోకేశ్ బంధంపై నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర చాలా మంచి మనిషి అని, తన తండ్రికి సరైన జోడీ అని నవీన్ తెలిపాడు. ఆమె తన తండ్రి జీవితంలో ప్రశాంతతను తీసుకొచ్చిందని, ఈ బంధాన్ని నానమ్మ, తాతయ్యలు కూడా ఆమోదించారని వెల్లడించాడు. ప్రస్తుతం నవీన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. సీనియర్ నటి పవిత్రా లోకేశ్ తో చాలా కాలంగా కలిసే ఉంటున్నరాయన. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో భార్య భర్తలుగా నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లోనూ కలిసే జీవిస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, పార్టీలకు జంటగానే హాజరవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి నరేశ్‌ కుమారుడు, నటుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. దర్శకుడిగా సత్య అనే షార్ట్‌ ఫిలిం తీశాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న నవీన్… రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో… తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే నరేష్- పవిత్రల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవిత్ర లోకేశ్‌ చాలా మంచి మనిషని చెప్పిన నవీన్.. తనని తరచూ కలుస్తుంటానన్నాడు. ఆమె అందరినీ ప్రేమగా పలకరిస్తుంటుందని.. అందరితోనూ ఇట్టే కలిసిపోతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన నాన్నకు ఆమె సరైన జోడీ అని అభిప్రాయపడ్డాడు. ఆమె ఉన్నప్పుడు నాన్న కూడా సైలెంట్‌గా ఉంటాడని… 50 ప్లస్ ఏజ్‌లో నాన్న ఇంత ప్రశాంతంగా ఉండటానికి ఆమెనే కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేమకు ఎటువంటి హద్దులు లేవనడానికి వీరిద్దరే నిదర్శనమన్నాడు నవీన్. అంతేకాదు పవిత్ర- నాన్నల బంధాన్ని నిర్మల నానమ్మ, కృష్ణ తాతయ్య కూడా స్వాగతించారన్నాడు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా.. నానమ్మ- తాతయ్య సపోర్ట్‌ చేసేవారన్నాడు. పవిత్ర వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నవీన్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

Follow Us