HIT2 : క్రైమ్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన అడవి శేష్.. “హిట్ 2” బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. శైలేష్ కుమార్ హిట్ 2ని డైరెక్ట్ చేశారు. గతంలో వచ్చిన హిట్ సినిమాకు ఇది కొనసాగింపు.
యంగ్ హీరో అడవి శేష్ నటించి హిట్ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. శైలేష్ కుమార్ హిట్ 2ని డైరెక్ట్ చేశారు. గతంలో వచ్చిన హిట్ సినిమాకు ఇది కొనసాగింపు. ఇక ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు శేష్. సినిమా హిట్ కావడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏ మూవీ సెలబ్రేషన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ అన్నపుడు కచ్చితంగా ఆ ప్రెజర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి.. అంచనాలు అందుకుంటేనే రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. ఈ విషయంలో ‘హిట్’ దర్శకుడు శేలేష్ కొలను సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత హిట్ 3 కూడా రాబోతోంది. త్వరలోనే దీని పై అప్డేట్ ఇవ్వనున్నారు.
Published on: Dec 04, 2022 07:55 PM