Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!

Edited By:

Updated on: Jul 15, 2026 | 9:10 PM

‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడి పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలకు దర్శకుడు నాగ్ అశ్విన్ తొలిసారి ఘాటుగా స్పందించారు. తాను ఏం చేస్తున్నానో తనకు తెలుసని, పూర్తి అవగాహన కోసం ‘కల్కి 2’ విడుదల వరకు వేచి చూడాలని సూచించారు. మహాభారతంలో కర్ణుడి గొప్పతనాన్ని శ్రీకృష్ణుడే వివరించారని పేర్కొంటూ సంబంధిత ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కల్కి సినిమా సాధించిన విజయం కంటే.. అందులో కర్ణుడి పాత్రను చూపించిన విధానం గురించే ఎక్కువగా చర్చ జరిగింది. సినిమా 1000 కోట్లు వసూలు చేసినా.. ఇతిహాసాలను మార్చేసారనే విమర్శలనే ఎక్కువగా మూట గట్టుకున్నారు నాగీ. అయితే ఏనాడూ ఈ వివాదంపై స్పందించని ఈ దర్శకుడు.. ఫస్ట్ టైమ్ నోరు విప్పారు. కర్ణుడి క్యారెక్టర్‌పై సీరియస్ రిప్లై ఇచ్చారు నాగ్ అశ్విన్. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి 2 తర్వాత రెండోసారి 1000 కోట్లు అందుకున్న సినిమా కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మహాభారతంలోని పాత్రలు కూడా ఉంటాయి. అందుకే విజయంతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా కర్ణుడి పాత్రను ఆయన చిత్రీకరించిన విధానంపై కొందరు ప్రముఖులు బాహాటంగానే విమర్శించారు. కల్కి విడుదలైనప్పటి నుంచే కర్ణుడి పాత్ర గురించి ఎక్కడో ఓ చోట చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా లెనిన్ సినిమాపై ఓ నెటిజన్ కర్ణుడి టాపిక్ తెచ్చారు.. లెనిన్‌లోనూ భారతం ఉంది.. కర్ణుడి పాత్రను ప్రమోద్ పంజు పోషించిన వసంత్‌లా చూపించాలి.. కల్కిలో కర్ణుడిని గొప్పగా చూపించారంటూ కామెంట్ చేసారు. నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై నాగ్ అశ్విన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. తెలుసుకోవాల్సింది మీరే.. పార్ట్ 2 కోసం వేచి చూడండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ద్రోణ వధ పర్వంలో అర్జునుడితో కర్ణుడి గొప్పతనం గురించి శ్రీ కృష్ణుడే స్వయంగా చెప్పారు.. దయచేసి మీరు మహాభారత చదవండి అంటూ వివేక్ దేబ్‌రాయ్ ఇంగ్లీష్‌లో అనువదించిన మహాభారతంలోని పేజీని పోస్ట్ చేసారు నాగీ. మహాభారతం గురించి మీకు చదివే సమయం లేకపోతే.. కర్ణుడిని శ్రీ కృష్ణుడు ఎన్నిసార్లు పొగిడారు అనేది గూగుల్ చేయాలంటూ సీరియస్ రిప్లై ఇచ్చారు. తాను చేస్తున్న పనిపై క్లారిటీ ఉందని.. పార్ట్ 2 చూస్తే మీరు సీన్ అంతా అర్థమవుతుందన్నారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే కల్కి 2లో జాయిన్ కానున్నారు. మొత్తానికి కర్ణుడి టాపిక్‌పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చారు నాగీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

Vijay Deverakonda: అభిమానికి విజయ్‌ దేవరకొండ అభయం!

Follow Us