సబ్బు తెచ్చిన తంట.. చిక్కుల్లో తమన్నా! కన్నడ ప్రజలు సీరియస్

Updated on: May 24, 2025 | 2:34 PM

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యకాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తెలుగులో రీసెంట్ గా ఓదెల 2 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తమన్నా అఘోర పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది.

ఈ విషయం పక్కకు పెడితే.. తమన్నా ఉన్నట్టుండి చిక్కుల్లో పండింది.తమన్నా పై కన్నడ ప్రేక్షకులు సీరియస్ అవుతున్నారు. తమన్నా తమకొద్దు అంటూ విమర్శలు చేస్తున్నారు. తమన్నాను రీసెంట్ గా మైసూర్ శాండల్‌ సోప్ తో డీల్ చేసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాను మైసూర్ శాండల్‌ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మైసూర్ శాండల్‌ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను ఎంపిక చేసింది. అయితే ఈ డీల్ ఇప్పుడు తమన్నాను చిక్కుల్లో పడేసింది. కర్ణాటక బ్రాండ్‌గా ఉన్న మైసూర్ శాండల్ కు తమన్నాను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కన్నడిగులు ప్రశ్నిస్తున్నారు. మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ కు తమన్నాను నియమించడం పై వస్తున్న విమర్శల పై కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్‌ అయ్యారు. పాన్-ఇండియా సెలబ్రిటీ అయితే మైసూర్ శాండల్‌ సోప్ విస్తరణను భారీగా పెంచొచ్చు అని అన్నారు. ఇక ఈ డీల్ కోసం తమన్నా ఏకంగా రూ. 6.2 కోట్లు అందుకుంటుందని తెలుస్తుంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న మైసూరు శాండల్ స‌బ్బుల‌తో పాటు ఇతర ఉత్పత్తులకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా నియమించారు. కన్నడలో స్టార్స్ ఉండగా తమన్నా ఎందుకు అంటూ కన్నడిగులు సీరియస్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపిక బ్యాడ్‌లక్‌ కాస్తా.. రుక్మిణీ గుడ్‌లక్‌ అయిందిగా.. ప్రభాస్ పక్కన బంపర్ ఆఫర్

అమర జవాన్ కుంటుంబానికి ఆర్థిక సాయం.. చిన్న హీరోయిన్ పెద్ద మనసు !!