చెర్రీ రూట్లో నాని.. మరి వీడియో ఎక్కడ ??
సినిమా పాటల ప్రమోషన్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. కేవలం పాటలు రిలీజ్ చేయడం కాకుండా, ఇప్పుడు వాటి మేకింగ్ వీడియోలను పంచుకుంటున్నారు. చికిరి పాటతో మొదలైన ఈ స్ట్రాటజీని ఆయా షేర్ కొనసాగించింది. ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో భారీ సెట్ నిర్మించారు, 60 ఇళ్లు, కొలను, ఏజింగ్ టెక్నిక్స్ తో అద్భుతమైన చిత్రీకరణ చేశారు. ఇది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ప్రీ రిలీజ్ టైమ్ లో సినిమా ప్రమోషన్‌లో ఇప్పుడో కొత్త స్ట్రాటజీ కనిపిస్తోంది. ఇంతకు ముందు జస్ట్ సాంగ్స్ ని రిలీజ్ చేసి వదిలేసేవారు. ఆ తర్వాత మిలియన్ మార్చి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ, ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఆ పాట చిత్రీకరణ సీక్రెట్స్ ని పంచుకుంటున్నారు. రీసెంట్ గా చికిరి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ని ఇప్పుడు షేర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చికిరి చికిరి అంటూ రామ్ చరణ్ ఆ మధ్య రికార్డులన్నీ కొల్లగొట్టేశారు. ఆ సాంగ్‌కి వచ్చిన క్రేజ్‌ని గమనించిన మేకర్స్… ఆ పాటను చిత్రీకరించిన లొకేషన్ల గురించి డీటైల్స్ షేర్ చేశారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో యూనిట్ మధ్య సరదాగా సాగిన సంభాషణ మేకింగ్ వీడియోలో హైలైట్ అయింది. అప్పుడు చికిరి సాంగ్ మేకింగ్ క్లిక్ అయితే, ఇప్పుడు ఆయా షేర్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ సాంగ్ థీమ్‌ని, దాని వెనుక కృషిని, ఆ బ్యాక్ గ్రౌండ్‌ని ఎక్స్ ప్లెయిన్ చేసేశారు మేకర్స్. ఆయా షేర్ సాంగ్ కోసం రెండున్నర ఎకరాల్లో భారీ సెట్ ఏర్పాటు చేశారట. మామూలుగా సినిమా సెట్స్ అంటే డమ్మీ స్ట్రక్చర్ వాడుతారు.కానీ ఆయా షేర్ కోసం ఒరిజినల్ గా కన్‌స్ట్రక్ట్ చేశారట. దాదాపు 60 ఇళ్లను నిర్మించారట. ఇందులో కనిపించే బిర్యానీ బౌల్ కోసం దాదాపు ఐదు రోజులు కష్టపడ్డారట. ఏజింగ్ టెక్నిక్స్ వాడి చాలా వరకు రియల్ లుఖ్ తీసుకురావడానికి ట్రై చేశారట. 100 ట్యాంకర్ల నీటితో కొలను సృష్టించామని, స్క్రీన్ మీద అందంగా ఉంటుందన్నారు మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 2: ధురంధర్ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్.. జర భద్రం
పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం
Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా
Rashmika: రష్మిక కాక్‌టైల్ పార్టీ డేట్ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా