Siva Reddy Mimicry Video: మిమిక్రీతో అలరించిన శివా రెడ్డి .. లక్ష్మీ పార్వతి, జీవిత రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ..

|

Sep 29, 2023 | 6:45 PM

Siva Reddy Mimicry Video: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేడుకగా సాగింది. వేలాదికి తరలివచ్చిన గణేశ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా టీవీ9 గురువారం రోజంతా ప్రత్యేక కార్యక్రమాలతో వీక్షకులను అలరించింది. ఇందులో భాగంగా నటుడు శివారెడ్డితో టీవీ9 స్టుడియోలో ప్రత్యేక ముఖాముఖీ నిర్వహించింది. ఈ కార్యక్రమం వీక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.

హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన కోలాహలం నెలకొంది. వేలాదికి తరలివచ్చిన గణేశ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని నిమజ్జనం చేశారు. శుక్రవారం కూడా గణేశ విగ్రహాల నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది.  ఈ సందర్భంగా టీవీ9 గురువారం రోజంతా ప్రత్యేక కార్యక్రమాలతో వీక్షకులను అలరించింది. ఇందులో భాగంగా నటుడు శివారెడ్డితో టీవీ9 స్టుడియోలో ప్రత్యేక ముఖాముఖీ నిర్వహించింది. ఈ కార్యక్రమం వీక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో భాగంగా శివా రెడ్డి.. లక్ష్మీ పార్వతి, జీవిత రాజశేఖర్‌తో పలువురు సెలబ్రిటీల వాయిస్‌ను ఇమిటేట్ చేస్తూ అదరగొట్టారు. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానం, తన అభిరుచులు సహా పలు అంశాల గురించి శివారెడ్డి తన అభిమానులతో పంచుకున్నారు.

Published on: Sep 29, 2023 02:59 PM