ది బెస్ట్ క్రైమ్ థిల్లర్! కోలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఉందంటే నమ్మలేరు
క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాల్లోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.
ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ సినిమాలోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కింది. ఆ సినిమా పేరే ఇంద్రా. సస్పెండ్ అయిన పోలీస్, ఓ సీరియల్ కిల్లర్, హత్యకు గురైన భార్య.. ఇలా ముగ్గురు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఓ అనుకోని సంఘటన కారణంగా పోలీస్ ఆఫీసర్ గా పని చేసే హీరో చూపు కోల్పోతాడు. ఆ తర్వాత అతని భార్య దారుణ హత్యకు గురవుతోంది. తన భార్య చనిపోయినట్లుగానే మరికొంత మంది మహిళలు కూడా హత్యకు గురవుతారు. ఈ మర్డర్ల వెనక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుస్తుంది. మరోవైపు హీరో కూడా తన భార్యను చంపిన హంతకుడిని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగుతాడు. దీంతో మూవీ స్పీడ్ గా సాగిపోతుంది. ఈ క్రమంలో హీరోకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. తన గతంతో ఆ మర్డర్ చేసే వాడికి సంబంధం ఉందని, తన కళ్లు పోవడానికి కారణం అతడే అని హీరోకు తెలుస్తుంది. మరి పోలీస్ భార్యతో పాటు మహిళలదరినీ దారుణంగా చంపింది ఎవరు? చివరకు కళ్లులేని పోలీస్ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు? అసలు సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంటి? ఎందుకీ హత్యలు చేస్తున్నాడనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సబరిష్ నంద దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర మూవీలో .. వసంత్ రవి హీరోగా నటించాడు. మెహ్రీన్ పిర్జాద, సునీల్, అనికా సురేంద్రన్ , కల్యాణ్ కీ రోల్స్ చేశారు. సుమారు 2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు టెన్ కొట్టాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే డిస్సపాయింట్ అయ్యే విషయం ఏంటంటే ఇది తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో లేదు. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం తెలుగు సబ్‌టైటిల్స్‌తో మీరు ఈ మూవీని చూసేయొచ్చు. మీకు క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం అనుకుంటే.. ఓ లుక్కేసేయండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అకీరా కాదు..ఆదిత్య ! సోషల్ మీడియా దుమ్ముదులుపుతున్న OG కుర్రాడు
ఈ కథలు చిన్నతనంలో విన్నానన్న NTR
విజయవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
