‘నా అన్న ధ్రువతార, పితృసమానుడు’ పవన్‌ ఎమోషనల్ ట్వీట్

Updated on: Aug 23, 2025 | 11:45 AM

అన్నగా.. అనితరసాధ్యుడిగా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగొందుతున్న మెగాస్టార్ చిరుకు.. తమ్ముడు జనసేనాని.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్టర్ హ్యాండిల్లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తన అన్న గొప్పతనాన్ని.. మంచి గుణాన్ని.. ఎంతో ఎత్తుకు ఎదిగిన తీరును వివరించాడు. నా అన్న విశ్వంభరుడు అంటూ కోట్ చేశాడు.

ఇప్పుడీ ట్వీట్‌తో మరో తన అన్న మీదున్న ప్రేమను, గౌరవాన్ని మరో సారి బయటపెట్టారు పవన్‌. పవన్‌ కళ్యాణ్‌ తన ట్వీట్లో ఏం రాసుకొచ్చారంటే.. ‘చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం… వెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన ‘విశ్వంభరుడు’..! పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ – మీ పవన్ కళ్యాణ్‌ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు పవన్. అంతేకాదు తన అన్న తనను ముద్దాడుతున్న ఫోటోను కూడా షేర్ చేశారు పవన్ కళ్యాణ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాలపై సమంత కీలక నిర్ణయం..! ఇదేదో ఎప్పుడో చేస్తే అయిపోయేదిగా..