Chiranjeevi: నిర్మొహమాటంగా నో.. స్టార్ ప్రొడ్యూసర్‌కు షాకిచ్చిన చిరు.. వీడియో.
ఇండస్ట్రీలో ఎవరెస్ట్ రేంజ్ హోదా..! నెంబర్ వన్ ఇమేజ్ తనదేనట! సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్లు క్యూ కడుతుంటారట! ఆయనతో సినిమా చేయడమే యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్ల డ్రీమ్ అట! ఇది సింపుల్ గా చిరు గురించి వినిపించే మాటలట. మరి ఇలాంటి ఇమేజ్.. క్రేజ్ ఉన్న చిరు.. అంతే సింపుల్‌గా రిమేక్ సినిమాలు చేయడం ఏంటని అందరూ అంటున్న మాట. కాదు కాదు భోళా శంకర్ రిజెల్ట్ తర్వాత నేరుగా.. చేస్తున్నారు విమర్శలు కూడా!
ఇండస్ట్రీలో ఎవరెస్ట్ రేంజ్ హోదా..! నెంబర్ వన్ ఇమేజ్ తనదేనట! సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్లు క్యూ కడుతుంటారట! ఆయనతో సినిమా చేయడమే యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్ల డ్రీమ్ అట! ఇది సింపుల్ గా చిరు గురించి వినిపించే మాటలట. మరి ఇలాంటి ఇమేజ్.. క్రేజ్ ఉన్న చిరు.. అంతే సింపుల్‌గా రిమేక్ సినిమాలు చేయడం ఏంటని అందరూ అంటున్న మాట. కాదు కాదు భోళా శంకర్ రిజెల్ట్ తర్వాత నేరుగా.. చేస్తున్నారు విమర్శలు కూడా! అవి చిరు చెవిలో కూడా పడ్డాయట. మరి అందుకే అన్నట్టు.. తాజాగా చిరు ఓ బిగ్ డెసీషన్ తీసుకున్నారట. తన దగ్గరకు వచ్చిన ఓ బడా ప్రొడ్యూసర్‌కు నిర్మొహమాటంగా నో కూడా చెప్పారట. ఎస్ ! ఆఫ్టర్ రీఎంట్రీ తన ఫస్ట్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150తో రికార్డుల క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరు.. ఆ తరువాత సైరా తో పాన్ ఇండియన్ రేంజ్లో బజ్ చేశారు. కానీ తరువాత వచ్చిన ఆచార్యతో మాత్రం అందర్నీ డిస్సపాయింట్ చేశారు. దాని నుంచి తేరుకొని.. వెంటనే మలయాళీ హిట్ మూవీ.. లూసీఫర్‌ను గాడ్ ఫాదర్‌గా తెలుగులో రిమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు. కానీ కలెక్షన్స్‌లలో మాత్రం తన మార్క్ చూపించలేకపోయారు. రీమేక్ అవసరమా అనే కొశ్చ్వన్ మొట్టమొదటి సారిగా అప్పుడు వచ్చేలా చేసుకున్నారు.
ఇక ఆ తర్వాత వాల్తేరు వీరయ్య ఫ్రెష్ సబ్జెక్ట్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరు.. ఆ వెంటనే మరో రిమేక్ మూవీ భోళా శంకర్‌తో మన ముందుకు వచ్చారు. చిరు రేంజ్ సినిమా కాదనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. అంతేకాదు.. తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో చిరు రిమేక్‌ల జోలికి పోకుండా ఉండేందుకు తాజాగా డిసైడ్ అయ్యారట. ఎస్ ! రీసెంట్‌గా చిరు దగ్గరకు.. మలయాళ సూపర్ హిట్ సినిమా రిమేక్ రైట్స్ పట్టుకుని ఓ స్టార్ ప్రొడ్యూర్ వచ్చారట. సినిమా చేయాలని.. రిక్వెస్ట్ చేశారట. ఈ రైట్స్ తమకోసమే తీసుకున్నట్టు.. ఈ సారి బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమన్నట్టు చిరుతో గట్టిగానే చెప్పారట. కానీ ప్రొడ్యూసర్ మాటలు విన్న చిరు.. నిర్మొహమాటంగా… నో చెప్పారట. ఇక పై రిమేక్స్ చేయనంటూ.. వీలైతే ఫ్రెష్ సబ్జెక్ట్ తో రండిం అంటూ.. చాలా క్లియర్ గా.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట చిరు. అయితే ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..