‘గోదారి గట్టు’ సాంగ్‌ను మించేలా.. చిరుతో నయన్ రొమాంటిక్ సాంగ్
చూస్తుండగానే సినిమాలు తీసేసి.. సూపర్ డూపర్ హిట్లు కొట్టే డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు చిరు సినిమాను కూడా తన స్టైల్లోనే పరిగెత్తిస్తున్నాడు. షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ఫినిష్ చేసేస్తూ.. వచ్చే సంక్రాంతికి చిరు సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు చిరుతో చేసే సినిమా సూపర్ హిట్టయ్యేలా తన మార్క్ కమర్షియల్ ఫార్ములాను అప్లై చేస్తున్నాడట రావిపూడి.
ఈక్రమంలోనే చిరు నయన్ మధ్య గోదారి గట్టు సాంగ్‌ను మించేలా ఓ రొమాంటిక్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట ఈ డైరెక్టర్. తన కెరీర్ బిగినింగ్ నుంచే.. తన సినిమాల్లో ఓ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్స్‌ను ఉండేలా చూసుకునే అనిల్ రావిపూడి.. మెగా 157లో కూడా అలాంటి సాంగ్‌నే ప్లాన్ చేశారట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద రామచిలుకవే సాంగ్ ను మించేలా… చిరు- నయన్ మధ్య దిమ్మతిరిగే రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారట అనిల్. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలికి ఇదే విషయం చెప్పి సాంగ్‌ను కంపోజ్ చేయిస్తున్నారట. మరో పక్క చిరు కూడా.. ఆ రొమాంటిక్ నంబర్‌కు ఓకే చెప్పారట. అంతేకాదు ఈ రొమాంటిక్ సాంగ్‌లో చిరుతో స్పెప్పులు వేయించేందుకు శేఖర్ మాస్టర్‌ను తీసుకుంటున్నారట రావిపూడి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే స్వయంగా అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: