8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఎనిమిదేళ్ల తర్వాత ప్రముఖ నటుడు దిలీప్‌కు ఊరట లభించింది. ఎర్నాకుళం కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించగా, అదే కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చింది. 2017లో జరిగిన ఈ సంచలన ఘటనలో నటి కారులో వేధింపులకు గురయ్యారు. దిలీప్ తనపై కుట్ర జరిగిందని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.
మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఎనిమిదేళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. కేరళలో సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టు నుంచి డిసెంబర్ 8న ఉపశమనం లభించింది. ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టేసిన కోర్టు.. అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. అదే కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని దోషులుగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న కిడ్నాప్‌కు గురైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కొచ్చి సమీపంలో జరిగిన ఆ ఘటనలో, దుండగులు ఆమెను కారు లోపలే రెండు గంటల పాటు వేధించారని విచారణలో బయటపడింది. ఈ ఘటనలో మొత్తం పది మందిపై కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి, కుట్ర, ఆధారాలను నాశనం చేయడం వంటి అభియోగాలను వారిపై మోపారు. అదే ఏడాది జూన్‌లో ఫస్ట్ ఛార్జ్‌షీట్ దాఖలై, జూలైలో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యాడు. తాను నిర్దోషినేనని అప్పటి నుంచే చెబుతూ వచ్చిన దిలీప్.. తాజా తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఓ పెద్ద కుట్ర అన్నారు. ఈ ప్రయాణంలో తన పక్కన నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 2018 మార్చి 8న ప్రారంభమైన ఈ కేసు విచారణలో.. ఇప్పుడు తీర్పు వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా
