స్పెషల్ లేడీతో మహేష్ మాస్ స్టెప్పులు.. కుర్చీని తిరగేసే ప్లాన్ చేస్తున్న జక్కన్న

Updated on: Jul 18, 2025 | 6:42 PM

గుంటూరు కారం సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేస్తుంది కుర్చీ మడతపెట్టి సాంగ్. ఎందుకంటే.. ఈ సాంగ్‌ మహేష్‌లోని డ్యాన్సర్‌ను మనకు మరి కాస్త ఎక్కువగా పరిచయం చేసింది. తమన్ మాస్ బీట్.. శేకర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్‌.. ఈ రెండింటినీ మ్యాచ్‌ చేస్తూ.. మహేష్ శ్రీలీలతో ఆన్‌స్క్రీన్‌ పై రెచ్చిపోవడం బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చింది. అయితే ఇదే కిక్కును కంటిన్యూ చేయాలని చూస్తున్నాడ జక్కన్న.

గుంటూరు కారం సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేస్తుంది కుర్చీ మడతపెట్టి సాంగ్. ఎందుకంటే.. ఈ సాంగ్‌ మహేష్‌లోని డ్యాన్సర్‌ను మనకు మరి కాస్త ఎక్కువగా పరిచయం చేసింది. తమన్ మాస్ బీట్.. శేకర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్‌.. ఈ రెండింటినీ మ్యాచ్‌ చేస్తూ.. మహేష్ శ్రీలీలతో ఆన్‌స్క్రీన్‌ పై రెచ్చిపోవడం బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చింది. అయితే ఇదే కిక్కును కంటిన్యూ చేయాలని చూస్తున్నాడ జక్కన్న. ఎస్ ! గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి.. సాంగ్‌కి మహేష్‌ వేసిన స్టెప్పులు లాంటివే.. ఇప్పుడు రాజమౌళి సినిమాలోనూ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఈ మాటలు వైరల్‌ కాగానే.. ఇందులో స్టెప్పులేసే స్పెషల్‌ లేడీ ఎవరని ఆరా తీస్తున్నారు ఆడియన్స్. హైదరాబాద్‌ పరిసరాల్లో ఈ సాంగ్‌ కోసం ఓ స్పెషల్‌ సెట్‌ కూడా వేశారని టాక్‌. మార్కెట్‌ ప్లేస్‌ థీమ్‌తో సాగుతుందట ఈ సాంగ్‌. రియల్‌ లొకేషన్స్ ని రీక్రియేట్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే, రాజమౌళి – మహేష్ బాబు కాంబో సరికొత్త హై బెంచ్‌ మార్క్ సెట్ చేయనుంది అనడంలో సందేహం లేదని ఖుషీ అవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇక ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌ దాటి, విజువలైజేషన్‌ ఫేజ్‌లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసింది ఎస్‌ ఎస్‌ ఎంబీ29. ఆల్రెడీ కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్‌ అయ్యాయి. ఈ పని చేశాం.. అని ప్రత్యేకించి రాజమౌళి ఎక్కడా ఏమీ చెప్పకపోయినా, అన్నీ విషయాలను ఏదో రకంగా కనుక్కుంటూనే ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఈ స్పెషల్ సాంగ్ టాపిక్ కూడ బయటపడిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘గోదారి గట్టు’ సాంగ్‌ను మించేలా.. చిరుతో నయన్ రొమాంటిక్‌ సాంగ్

Junior: జూనియార్ రివ్యూ.. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే!