గ్యాప్ ఇవ్వలా వచ్చింది.. కానీ అది కూడా వాళ్ల మంచికే..!
గ్యాప్ తీసుకున్నా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ యువ హీరోలు. నిఖిల్ సిద్ధార్థ్, తేజ సజ్జా, శ్రీ విష్ణు, విజయ్ దేవరకొండ వరుసగా మూడు, నాలుగు సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా కాకుండా తక్కువ వ్యవధిలో వరుస విడుదలలకు సిద్ధమవుతూ తమ కెరీర్‌కు కొత్త వేగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్కోసారి ఎక్కువ గ్యాప్ తీసుకుంటే కూడా మంచిదేనేమో..? ఎందుకంటే ఏం చేయాలో క్లారిటీ వస్తుంది.. ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోలు చేస్తున్నదిదే. కావాల్సినంత గ్యాప్ తీసుకుంటున్నారు.. అలాగని ఖాళీగానే ఉన్నారేమో అనుకుంటే పొరపాటే.. ఈ గ్యాప్‌లో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. మరి అలా గ్యాప్‌ను యూజ్ చేసుకుంటున్న హీరోలెవరో చూద్దామా..? తెలియకుండానే కెరీర్‌లో భారీ బ్రేక్ తీసుకున్నారు నిఖిల్ సిద్ధార్థ్. ఈయన లాస్ట్ సినిమా స్పై విడుదలై మూడేళ్లు దాటేసింది.. 2024లో అపుడో ఇపుడో ఎపుడో వచ్చింది కానీ అది కూడా ఎన్నో వాయిదాల తర్వాతే విడుదలైంది. గ్యాప్ తీసుకున్నా ఒకేసారి మూడు సినిమాలు రెడీ చేస్తున్నారు నిఖిల్. స్వయంభు సిద్ధంగా ఉంటే.. ది ఇండియా హౌజ్ షూట్ 50 శాతం పూర్తైంది. ఇక కార్తికేయ 3 ఆల్రెడీ లాక్ అయింది. నిఖిల్ నుంచి మూడు సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే రానున్నాయి. మరోవైపు తేజ సజ్జా కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. మిరాయ్ వచ్చి ఏడాది దాటినా.. తేజ సజ్జా నుంచి మరో సినిమా రాలేదు. కానీ ఒకేసారి మిరాయ్ 2, జాంబి రెడ్డి 2తో పాటు జై హనుమాన్ సినిమాలు చేస్తున్నారు తేజ. ఈ మూవీస్ అన్నీ ఏడాది గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. శ్రీ విష్ణు కూడా ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్, రామ్ అబ్బరాజుతో చేస్తున్న సినిమాల షూట్ వేగంగా జరుగుతుండగా.. హసిత్ గోలీ దర్శకత్వంలో రవితేజతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా సెప్టెంబర్ 11న రణబాలితో రానున్నారు.. ఆ తర్వాత డిసెంబర్‌లో రౌడీ జనార్ధన రెడీ అవుతుంది. శౌర్యు, విక్రమ్ కే కుమార్ సినిమాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్ చూసి షాక్!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!