Directors: వేల కోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే.! మెయిన్ రాజమౌళి నే..

|

Oct 26, 2024 | 10:42 AM

ఇది వరకు సినిమాల మార్కెట్ ఒక లెక్క అయితే ప్రస్తుత సినిమాల మార్కెట్ ఒక లెక్క అని చెప్పాలి.. పూర్వం సినిమా మార్కెట్ హీరో ఇమేజ్ ను బట్టి ఉండేవి.. అయితే ప్రస్తతం భారం అంతా దర్శకుల మీదే పడుతోంది.. పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తున్న దర్శకులు, ఆ రేంజ్‌ వసూళ్లు సాధించే బాధ్యతను కూడా మోస్తున్నారు.. అంతే కాకుండా వేల కోట్ల టార్గెట్ తో రేస్ లోకి దిగుతున్నారు.. ఆ దర్శకులు ఎవరో మీరు ఓ లుక్ వేద్దాం.

భారీ బడ్జెట్‌ సినిమా అంటే ముందు రాజమౌళి గురించే మాట్లాడుకోవాలి. బాహుబలి తరువాత ఒక్కో సినిమాకు బడ్జెట్‌ డబుల్ చేసుకుంటూ పోతున్న జక్కన్న, నెక్ట్స్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను దాదాపు రెండు వేల కోట్లతో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మరి అంత పెద్ద బడ్జెట్ మూవీని తలకెత్తుకున్న తర్వాత.. వసూళ్లూ కూడా ఆ స్థాయిలో రావాలి. అంటే జక్కన్న తీసే మూవీ కూడా పాన్ వరల్డ్ లెవల్లో హిట్ కావాలి. సో.. మొత్తంగా ఇప్పుడు జక్కన్నసినిమాను మాత్రమే హిట్ చేస్తే సరిపోదు. కలెక్షన్స్ కూడా హిట్ చెయ్యాలి. మరి ఇది ఆయన మోయదగ్గ భారమేనా… కాదా.. అన్నది మూవీ రిలీజయ్యాక తేలే సంగతి.

రాజమౌళి తరువాత రెండు వేల కోట్ల రేంజ్ భారం మోస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమాకు రెడీ అవుతున్న నీల్‌, సలార్‌ 2ను కూడా లైన్‌లో పెట్టారు. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్ల మార్కెట్‌ ఉన్న ప్రాజెక్ట్సే కావటంతో ప్రశాంత్ మీద కూడా ఫ్యాన్స్ ఒత్తిడి గట్టిగా కనిపిస్తోంది. రెండు వేల కోట్ల రేంజ్ కాకపోయినా… ఖచ్చితంగా 12, 13 వందల కోట్ల వసూళ్లు సాధించాల్సిన సిచ్యుయేషన్‌లో ఉన్నారు లెక్కల మాస్టర్ సుకుమార్‌. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్‌ కావటంతో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌ రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. ఆల్రెడీ 1000 కోట్ల బిజినెస్‌ జరిగిందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. అంటే కచ్చితంగా అంతకు మించి వసూలు చేయాల్సిన ప్రెజర్‌ సుకుమార్ మీద ఉంది.

Follow us on