Krithi Shetty: బాలీవుడ్‌కు బేబమ్మ.. అక్కడైనా జాతకం మారుతుందా..?

Edited By:

Updated on: Oct 15, 2026 | 7:07 PM

తెలుగు సినిమాల్లో విజయాల కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టికి బాలీవుడ్‌ నుంచి అవకాశం వచ్చినట్లు సమాచారం. AVS స్టూడియోస్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ శెట్టి దగ్గర 17 ఏళ్లకు పైగా పనిచేసిన విధి ఘోడ్‌గాంకర్‌ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కృతి శెట్టి కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

ఆల్రెడీ బాలీవుడ్‌లో మన హీరోయిన్లు సత్తా చాటడం కాదు.. అక్కడే జెండా పాతేస్తున్నారు. ఈ లిస్టులోకి మరో బ్యూటీ కూడా చేరిపోయింది. సౌత్‌లో సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ భామకు ఊహించని విధంగా బాలీవుడ్ నుంచే పిలుపు అందింది. ఓ క్రేజీ లవ్ స్టోరీతో తన లక్ పరీక్షించుకోబోతోంది. మరి ఇంతకీ ఎవరా బ్యూటీ..? అక్కడ ఆమె చేస్తున్న సినిమా ఏంటి..? ప్రస్తుతం సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లో తమ హవా చూపిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. రామాయణ రిలీజ్‌కు ముందే సాయి పల్లవికి అక్కడ్నుంచి ఆఫర్స్ వస్తుండగా.. యానిమల్, ఛావా లాంటి హిట్స్ కొట్టిన రష్మిక పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆల్రెడీ షారుక్ ఖాన్‌తో జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ కొట్టి.. తాజాగా సల్మాన్ ఖాన్‌తో మరో క్రేజీ మూవీ చేస్తున్నారు. కీర్తి సురేష్, సమంత, శ్రీలీల లాంటి బ్యూటీస్ సైతం బాలీవుడ్‌లో సత్తా చూపిస్తున్నారు. వీళ్ళ బాటలోనే కృతి శెట్టి కూడా జాయిన్ అయిపోయారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత AVS స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను అనౌన్స్ చేశారు. రోహిత్ శెట్టి దగ్గర 17 ఏళ్లకు పైగా వర్క్ చేసిన విధి ఘోడ్‌గాంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగులో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటిస్తున్నారు కృతి. దీని తర్వాత హిందీ సినిమా షూట్ మొదలు కానుంది. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం చూస్తున్న కృతి శెట్టికి జనవరి 12 విడుదలతో పాటు హిందీ ప్రాజెక్ట్ ఎంతవరకు హెల్ప్ అవుతాయనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్‌ ధనికుల ఆదాయం చాలా తక్కువని తెలుసా

హైదరాబాద్‌–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!

విమానంలో షాకింగ్‌ ఘటన.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికిన నటి

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

Loading...
Unable to load recommendations.
Follow Us