జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..

Updated on: Feb 03, 2026 | 11:23 AM

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు 300 కిలోల అరుదైన టేకు చేప చిక్కింది. ఇది లోతైన సముద్రంలో మాత్రమే కనిపించే చేప, ఇంత భారీ పరిమాణంలో దొరకడం అరుదు. ఔషధాలు, అలంకరణ వస్తువుల తయారీలో ఉపయోగించే ఈ చేపను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. వేలంలో దీనిని రూ.20,000కి కొనుగోలు చేశారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన భారీ టేకు చేప చిక్కింది. సుమారు 300 కిలోల బరువు ఉన్న ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకురావడానికి మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం దానిని అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌కు తరలించారు. ఈ అతిపెద్ద చేప వార్త క్షణాల్లో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హార్బర్‌కు చేరుకుని ఆశ్చర్యంగా తిలకించారు. సాధారణంగా టేకు చేపలు లోతైన సముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయని, ఇంత భారీ పరిమాణంలో చిక్కడం అరుదైన విషయమని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అలాగే దాని శంకులను ఉపయోగించి అలంకరణ వస్తువులు తయారు చేస్తారని వారు పేర్కొన్నారు. చేపను దగ్గరగా చూడటానికి వచ్చిన వారు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. వేలంలో ఈ భారీ టేకు చేపను నర్సాపురానికి చెందిన వ్యాపారి రూ.20,000కి కొనుగోలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్.. హిట్ కావాలంటే తప్పదు బాస్

ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?

Sreeleela: స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా ??

రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే

రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు