Kangana Ranaut: దర్శకుల్ని హీరోలు తొక్కేస్తున్నారు !! కాంట్రవర్సీ లేపిన కంగన

Updated on: Mar 24, 2026 | 8:43 PM

నటి కంగనా రనౌత్ దర్శకుల ప్రాముఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌లో దర్శకులకుండే గౌరవం బాలీవుడ్‌లో లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిత్య ధర్‌ను గొప్ప దర్శకుడిగా కీర్తించిన కంగనా, బాలీవుడ్‌లో దర్శకులు తక్కువ పారితోషికంతో వేధింపులకు గురవుతున్నారని విమర్శించారు. యువత నటులు కావాలనే కలలు కంటున్నారని, ఇది పరిశ్రమ దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనమన్నారు.

తాజాగా నటి కంగన రనౌత్‌ దర్శకుల ప్రాముఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌లో నటుల కంటే దర్శకులకే ఎక్కువ గౌరవం, గుర్తింపు ఉంటుందని అన్నారు. ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ ను హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్, క్వెంటిన్ టరంటినోలతో పోల్చారు. ఆదిత్య వారి స్థాయిని అందుకున్నారని ఆమె కొనియాడారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆదిత్యను “సూపర్‌స్టార్ డైరెక్టర్” అని అభివర్ణించారు. ఈ ప్రశంసల మధ్యే కంగనా బాలీవుడ్‌లోని విచారకరమైన పరిస్థితులను ఎండగట్టారు. మన దేశంలో చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు తగినంత గౌరవం లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “దర్శకులు రేయింబవళ్లు శ్రమిస్తూ, తక్కువ పారితోషికం పొందుతున్నారు. అంతేకాకుండా, ఇక్కడ సూపర్‌స్టార్లు ఫిల్మ్‌మేకర్లను వేధిస్తారు, వారిని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిస్థితుల వల్లే నేటి యువత కేవలం నటులు కావాలని మాత్రమే కలలు కంటున్నారని, డైరెక్టర్ కావాలనే ఆశయం ఎవరిలోనూ కనిపించడం లేదని ఆమె విమర్శించారు. అయితే, ఆదిత్య ధర్ విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. కంగనా కామెంట్స్‌ బాలీవుడ్‌లోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లు అసలు మనుషులేనా ?? యజమానుల నిర్లక్ష్యం మరీ ఇంత దారుణం జరిగింది

ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??

దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ

Published on: Mar 24, 2026 08:37 PM
Follow Us