Ramayana: ట్రెండ్ అవుతున్న రామాయణ టీజర్ డీటైల్స్

Edited By:

Updated on: Apr 02, 2026 | 8:19 PM

సినిమాల ప్రమోషన్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రిలీజ్‌కు ముందే గ్లింప్స్, టీజర్‌లు, ట్రైలర్‌లతో భారీ హైప్ సృష్టిస్తున్నారు. కల్కి, మహేష్ బాబు సినిమా ఈవెంట్లు దీనికి నిదర్శనం. ఇప్పుడు రామాయణ టీం కూడా ఈ పద్ధతిని అనుసరిస్తోంది. 2.38 నిమిషాల నిడివితో వస్తున్న ఈ టీజర్ మైండ్‌ బ్లోయింగ్ విజువల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని అంచనా.

సినిమా రిలీజుల సంగతి సరే, అంతకన్నా ముందు రిలీజ్‌ చేసే కంటెంట్‌ మీద ఫోకస్‌ పెరుగుతోంది. గ్లింప్స్ ల నుంచి మొదలుపెడితే, టీజర్లు, ట్రైలర్లు, పాటలు, కేరక్టర్ల ను రివీల్‌ చేసే వీడియోలు.. ప్రతిదీ సినిమాల మీద హైప్‌ పెంచేస్తున్నాయి. మనం చేస్తున్న పని పెద్దదైనప్పుడు, దాని ప్రమోషన్‌ కూడా భారీగానే ఉండాలని ఫిక్సవుతున్నారు ఆడియన్స్. కల్కి సినిమా ప్రమోషన్ల టైమ్‌లో నాగ్‌ అశ్విన్‌ ఈ సిద్ధాంతాన్నే ఫాలో అయ్యారు. ఆ తర్వాత కూడా పలువురు మేకర్స్ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. లేటెస్ట్ గా వారణాసి గ్లోబ్‌ ట్రాట్‌ ఈవెంట్లోనూ ఈ గ్రాండియర్‌ కనిపించింది. వారణాసిలో మహేష్‌బాబుని రాముడి పాత్రలో చూడ్డానికి రెడీ అవుతున్నారు జనాలు. గ్లోబ్‌ ట్రాటర్‌, టైమ్‌ ట్రాటర్‌గా మహేష్‌ ఈ సినిమాలో ఎలా మెప్పిస్తారోనన్నది వరల్డ్ వైడ్‌ ఉన్న ఆసక్తి. అంతటిని హైప్‌ క్రియేట్‌ కావాలంటే ప్రమోషన్స్ లో ఆ రేంజ్‌ కేర్‌ తీసుకోవాల్సిందే. ఈ ఫార్ములాని ఇప్పుడు రామాయణ టీమ్‌ కూడా ఫాలో అవుతోంది. రామాయణ టీజర్‌ని రెడీ చేసేసింది టీమ్‌. రెండు నిమిషాల 38 సెకన్ల నిడివితో టీజర్‌ని ప్రిపేర్‌ చేశారు. ప్రపంచ ఫిల్మ్ మేకర్స్ కి, ఫిల్మ్ మేకింగ్‌ని మా సినిమా సరికొత్తగా పరిచయం చేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ టీజర్‌ రిలీజ్‌ కానుంది. ఇటీవల లాస్‌ ఏంజెల్స్ లో అతి కొద్ది మంది కీ మెంబర్స్ టీజర్‌ ప్రొజెక్షన్‌కి హాజరయ్యారట. మైండ్‌ బ్లోయింగ్‌ విజువల్స్ తో మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమైందనే టాక్‌ స్పాట్‌లోనే స్ప్రెడ్‌ అయింది. ఇంతగా ఊరిస్తున్న టీజర్‌ని చూడ్డానికి తాము కూడా వెయిటింగ్‌ అంటున్నారు అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Follow Us