జపాన్‌ లోకల్ ట్రైన్‌లో NTR క్రేజ్‌.. అవాక్కవుతున్న ఇండియన్స్‌

Updated on: Aug 12, 2025 | 5:06 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్... టాలీవుడ్ హీరో అనే ట్యాగ్‌ ఎప్పుడో చెరిగిపోయింది. బార్డర్ లెస్ క్రేజ్‌తో అభిమానులను సొంతం చేసుకోవడం ట్రిపుల్ ఆర్ సినిమాతోనే జరిగిపోయింది. అందుకు నిదర్శనంగా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఓ వీడియో అందర్నీ ఆగిచూసేలా.. తారక్ క్రేజ్‌ చూసి నివ్వరపోయేలా చేస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు దేశ విదేశాల్లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా జపాన్ లో తారక్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ రిలీజ్ సమయంలో తారక్ అక్కడ పర్యటించారు. అలాగే ఇటీవల దేవర సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేశారు. తారక్ కు జపాన్ లో లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఓ జపాన్ యువతి తారక్ సినిమాలు చూసి తెలుగు కూడా నేర్చుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. జపాన్ లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి బ్యాగ్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్న కీచైన్‌ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎక్కడో ఉన్న జపాన్ లోకల్ ట్రైన్ లో తారక్ లాకెట్ ఉందంటే ఆయన క్రేజ్ బార్డర్స్ దాటిందంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో రైల్‌ పై కూలీ పోస్టర్.. దెబ్బకు దడదడలాడించిన NTR ఫ్యాన్స్‌

వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి