లోబోకు ఏడాది జైలు శిక్ష..! ఇద్దరి చావుకు కారణం..7 ఏళ్ల తర్వాత తీర్పు
లోబో! బుల్లి తెలపై కెరీర్ స్టార్ చేసిన ఇతను.. తన యునిక్ డ్రెస్సింగ్ అండ్ గెటప్‌తో.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ ఐదో సీజన్ షోలోనూ పార్టిసిపేట్ చేసి... తన గేమ్‌తో.. కామెంట్స్‌తో నెట్టింట వైరల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన లోబో.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. పలు వీడియోలు చేస్తున్నాడు.
ఈక్రమంలోనే లోబో కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరి మృతితోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడు లోబో అలియాస్ ఖయూమ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో టీం వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాంల్లో పర్యటించింది. ఆ తర్వాత కారులో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే తన టీం ప్రయాణిస్తున్న కారును డ్రైవ్ చేస్తున్న లోబో.. రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలోని ఇతర ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో లోబో కారు కూడా బోల్తా పడింది. లోబోతో పాటు కారులోని తన టీం సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.ఈ క్రమంలోనే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏడు సంవత్సరాల విచారణ తర్వాత దీనిపై తాజాగా జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చింది. అలాగే రూ.12,500 జరిమానా కూడా విధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయానికే భయం పుట్టిస్తున్న హర్రర్ ఫిల్మ్.. అస్సలు మిస్ కావద్దు
ప్రభాస్ దెబ్బకు అరవ హీరో సైలెంట్ అవుతాడా ??
నా కొడుకు కాలు విరిగింది..! అంత బాధలోనూ నా జున్ను ఆ మాట అన్నాడు..
Kannappa: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..!